Sneha : సౌందర్య చనిపోయిందని పండగ చేసుకున్న హీరోయిన్…?

ఒకప్పుడు తన అందాలతో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసిన సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఒకానొక సమయంలో ఈ హీరోయిన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు అంటే ఈమె ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సౌందర్యం 31 ఏళ్లకే కన్ను మూసింది. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే మరణించడం చాలా దారుణం.

ఇక 100కు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్య తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. అయితే సౌందర్య చనిపోయినప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పార్టీ చేసుకుందని గతంలో వార్తలు వినిపించాయి. అయితే అలా పార్టీ చేసుకుందని వార్తలు వినిపించిన హీరోయిన్ ఎవరో కాదు స్నేహ. అప్పట్లో ఎక్కువగా హోమ్లీ పాత్రలు సౌందర్య చేసేది.

అయితే సౌందర్య చనిపోతే తనకు హోమ్లీ పాత్రలు వస్తాయనే ఉద్దేశంతో స్నేహ అలా పార్టీ చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ చేశారు. అయితే ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ క్లారిటీ ఇస్తూ, సౌందర్య చనిపోయినప్పుడు నేను పార్టీ చేసుకున్న అంటూ కొంతమంది నాపై రాశారు. కానీ అది తప్పు అది స్నేహ తెలిపింది. సౌందర్య చనిపోయినప్పుడు నేను చాలానే బాధపడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసిందట స్నేహ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు