Adhipurush : ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథని రిజెక్ట్ చేసిన ప్రభాస్- అతనెవరో కాదు..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్, ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాను చేస్తున్న ప్రతి సినిమాకి వైవిధ్యం కనబరుస్తూ, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రభాస్ తన దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చే దర్శకుడిలో అనుభవం కన్నాకూడ, కథ ఎలా చెప్తున్నాడు. కథలో ఎంతవరకు కొత్తధనం ఉందని మాత్రమే ఆలోచిస్తూ, సినిమాలకి ఒకే చెప్తున్నాడు. అందుకే ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన సినిమాల దర్శకులంతా సాహు సినిమా చేసిన సుజీత్, రాధేశ్యామ్ తీసిన రాధాకృష్ణ రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా తీసిన ఓం రౌత్ వీళ్లంతా ఒకటి, అర సినిమాలు చేసినవాల్లే.

అయితే ప్రభాస్ యువ దర్శకులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇటీవలనే ఒక యంగ్ డైరెక్టర్ కూడా ప్రభాస్ తో సినిమాల చేయాలనీ ఒక మాస్ మసాలా కథతో ప్రభాస్ దగ్గరికి వెళ్లి కథ వినిపించగా, ప్రభాస్ వెంటనే రిజెక్ట్ చేసాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా, ప్రాజెక్ట్ కే, మరియు మారుతీ సినిమాలు దేనికదో కొత్త కథ అవడంతో అదే తరహాలో ఏదైన డిఫరెంట్ గా ఉండే సబ్జెక్ట్ అయితే ఆయన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ప్రభాస్ తన అభిప్రాయం చెప్పాడట కానీ అలాంటి కథలేవీ ఆ డైరెక్టర్ దగ్గర లేకపోవడంతో వెనుదిరిగాడని సమాచారం.

ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు ఇటీవలనే బాలకృష్ణతో వీరసింహరెడ్డి సినిమా తీసి, సూపర్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని. మొదట తలపతి విజయ్ కి కథ చెబుదామని ట్రై చేయగా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో ప్రభాస్ గూటికి చేరిన ఈ డైరెక్టర్ కి ప్రభాస్ కూడా నో చెప్పడంతో ప్రస్తుతం రవితేజతో సినిమా చేయడానికి చూస్తున్నడని టాక్.

- Advertisement -

గతంలో గోలిచంద్ మలినేని,రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అవడంతో వీళ్లా కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. మరీ ఈ హిట్ సెంటిమెంట్ ని రాబోయే సినిమాతో కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు