Prabhas: రామాగ్రాహం, ప్రజాగ్రహం – మొత్తానికి ప్రాణహాని..?

ఆదిపురుష్ సినిమా విషయంలో రికార్డులతో సమానంగా వివాదాలు కూడా నెలకొంటున్నాయి. సినిమా కథలో చేసిన మార్పులు, ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ల లుక్స్ దగ్గర నుండి డైలాగ్స్ వరకు ప్రతి విషయంలో విమర్శలు, వివాదాలు చుట్టు ముట్టాయి ఆదిపురుష్ టీమ్ ని. ఈ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ విషయంలో ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. నేటి తరానికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో డైలాగ్ రైటర్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రాసిన డైలాగ్స్ హనుమంతుడిని, రామాయణాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో డైలాగ్ రైటర్ ఏ మాత్రం తప్పుని ఒప్పుకోకుండా తనని తాను సమర్థించుకోవటం గమనార్హం.

వరుస విమర్శలతో జరగబోవు నష్టాన్ని గుర్తించిన సినిమా యూనిట్, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న డైలాగ్స్ లో మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డైలాగ్ రైటర్ మనోజ్ శుక్ల తనకి ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించటం హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ కంప్లైంట్ కి స్పందించిన ముంబై పోలీస్ అతనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపింది.

ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి ముందు దగ్గరుండి ప్రచారం చేసిన హిందూ సంఘాలు సినిమా రిలీజ్ అయ్యాక లోపాలను ఎత్తి సుపుతూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను నేపాల్ లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టం వచ్చినట్లు తీస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఓం అండ్ కో ఇప్పటికైనా తెలిసొచ్చి ఉండాలి. రోజుకో కొత్త వివాదంలో చిక్కుకుంటున్నప్పటికీ ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టిన ఆదిపురుష్ వీక్ డేస్ లో ఎలా రానిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు