Prabhas : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… ఆ స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. తాజాగా సోషల్ మీడియా “ఎక్స్”లో ఇప్పటిదాకా మరే ఇతర భారతీయ స్టార్ హీరో సాధించని ఘనతను ప్రభాస్ సాధించి చూపించారు. ఇక ఈ స్థానాన్ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. మరి అసలు ఆ కొత్త రికార్డు కథ ఏంటి? ప్రభాస్ ఏం సాధించాడు? అనే వివరాల్లోకి వెళితే….

ట్విట్టర్ టాప్ హ్యష్ ట్యాగ్స్ లో ప్రభాస్…
దీనిదేముంది? ట్విట్టర్లో స్టార్ హీరోలు అందరూ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు కదా! అలాంటప్పుడు ప్రభాస్ సాధించిన ఘనత ఇందులో ఏముంది? అనుకుంటున్నారా.. అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే. టాప్ హ్యష్ ట్యాగ్స్ ఆన్ ఎక్స్ ఇన్ ఇండియా లిస్ట్ లో ప్రభాస్ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 మధ్యకాలంలో అంటే దాదాపు ఏడాది కాలం పాటు భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన హ్యష్ ట్యాగ్స్ లిస్ట్ ను ట్విట్టర్ తాజాగా రిలీజ్ చేసింది. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో టాప్ 10 లిస్ట్ లో ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ పేరు కనిపించింది. టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రభాస్ హాష్ ట్యాగ్ ఏడవ స్థానంలో ఉండడంతో రెబల్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ప్రభాస్ రాముడిగా కనిపించిన ఆది పురుష్ మూవీకి ఇందులో తొమ్మిదవ స్థానం దక్కింది. ఇంకేముంది మన ఇండియన్ బాహుబలికి తిరుగులేదు అంటూ ప్రభాస్ అభిమానులు దీన్నొక సెలబ్రేషన్ గా జరుపుకుంటున్నారు. ఇప్పటిదాకా ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, ఈ అరుదైన ఫీట్ సాధించి ప్రభాస్ చరిత్రను సృష్టించారు.

మనోడు ఎక్కడున్నా రాజే…
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ మనస్తత్వానికి, ఆయన నటనకు, కటౌట్ కు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. అందుకే ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా ప్రభాస్ సినిమాల కోసం మరింత ఆకలి పెరిగింది. బాహుబలి తర్వాత అందరూ ప్రభాస్ రాజును రాజుగానే చూడడం మొదలు పెట్టారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన అరుదైన రికార్డును సాధించగా, వీడు ఎక్కడున్నా రాజేరా అంటున్నారు తెలుగు ప్రజలు.

- Advertisement -

ప్రభాస్ సాలిడ్ లైనప్…
రీసెంట్ సలార్ మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ మూవీగా రూపొందుతున్న కల్కి గురించి ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో “రాజా సాబ్” అనే హారర్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సీక్వెల్ శౌర్యంగ పర్వం చేయనున్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడితో మరో సినిమా లైన్లో ఉన్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు