Anushka Shetty: మలయాళం సినిమాకు గ్రీన్ సిగ్నల్.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి మొన్నటి వరకు బొద్దుగా, ముద్దుగా కనిపించి సినిమాలలో అవకాశాలు కోల్పోయింది.. అయితే ఇప్పుడు తిరిగి సన్నగా తయారై.. క్యూట్ గా పూర్వ వైభవాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది..అందులో భాగంగానే ఇప్పుడు వరుస భాషా చిత్రాలలో అవకాశాలు అందుకుంటుంది.. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించడమే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటిన స్టార్ హీరోయిన్ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. అయితే గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రియంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.. కథనార్ – ద వైల్డ్ సోర్సరర్.. తాజాగా ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.. ఇది థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతూ ఉండగా.. ఈ చిత్రానికి రాజీన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక జయ సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రూ.75 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం..

అనుష్క రెమ్యూనరేషన్..
గతంలో ఒక్కో సినిమాకి రూ.3కోట్ల వరకే పరిమితమైన ఈమె పారితోషకం.. ఇప్పుడు ఈ మలయాళ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇదిలా ఉండగా అనుష్క శెట్టి ఇదివరకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కోసం రూ.6 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే మలయాళం సినిమాకి కూడా ఈమె దాదాపు అంతే తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. ఇప్పుడు మలయాళం లో కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం తో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అనుష్క కెరియర్..
తెలుగులో సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈమె.. కట్టు బొట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు బిల్లా వంటి సినిమాలలో బికినీ వేసి మరీ తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఇక అరుంధతి సినిమాలో అందరినీ భయపెట్టిన అనుష్క బాహుబలి సినిమాలో రాజసంతో మరొకసారి తన నటనలోని ప్రతివను కనబరిచి శభాష్ అనిపించుకుంది. ఇక తర్వాత నిశ్శబ్దం , భాగమతి వంటి సినిమాలలో కూడా నటించిన అనుష్క సైజ్ జీరో సినిమా చేసి ఈ సినిమాతో ఇండస్ట్రీ నుంచి దూరం అయింది.. ఇక ఇప్పుడిప్పుడే బరువు తగ్గుతున్న అనుష్క ఇలా ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ భారీగా డిమాండ్ చేస్తోందని సమాచారం..

- Advertisement -

అనుష్క వ్యక్తిగత జీవితం..
నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అనుష్క వివాహం చేసుకోలేదు.. గత కొన్ని సంవత్సరాల నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమాయణం నడుపుతోందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి… కానీ ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. మరొకవైపు అనుష్క బెంగళూరు కి చెందిన బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కూడా ఎటువంటి నిజం లేదనే చెప్పాలి.. మరి ఎప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కుతుందా అని అభిమానుల సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు