Naani: పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు , రెండేసి సినిమాలు చేసారు

ప్రస్తుతం సినిమాలు చేసే విధానం మారిపోయింది. ఒకప్పుడు ఒకే టైంలో మూడు నాలుగు షూటింగ్లలో పాల్గొనేవారు అలనాటి నటులు. కానీ ఇప్పుడు రెండేళ్లకు, ఏడాదికి ఒక సినిమా రావడమే కష్టమైపోతుంది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన హీరోలు అయితే ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి తరుణంలో కూడా కొంతమంది హీరోలు ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు.

ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోలు సినిమాలు వచ్చినట్లే 2023 సంక్రాంతికి కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను చేశారు. ఈ సినిమా కూడా దసరా కానుక విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించుకుంది.
బాలకృష్ణని చూపించిన విధానం అనిల్ రావిపూడి బాలకృష్ణ డీల్ చేసిన విధానం ఆ సినిమాలోని డైలాగ్స్, ఎంచుకున్న కాన్సెప్ట్ అన్నీ కూడా బాగా కలిసొచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఇకపోతే నేచురల్ స్టార్ నాని రీసెంట్ టైమ్స్ లో అద్భుతమైన సినిమాలు ఎన్నుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. నాని నటించిన దసరా సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నానికి 100 కోట్లు మార్కెట్ ని కూడా ఓపెన్ చేసిన సినిమా దసరా. ఆ సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్థాయి కూడా మారిపోయింది. మళ్ళీ శ్రీకాంత్ నానితో సినిమా చేయనున్నాడు. దసరా సినిమా తర్వాత నాని చేసిన సినిమా హాయ్ నాన్న సినిమా కూడా పాజిటివ్ టాక్ అందుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

- Advertisement -

ఇకపోతే తెలుగు హీరోలని పక్కన పెడితే బాలీవుడ్లో షారుక్ ఖాన్ పఠాన్ , జవాన్ సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం డంకీ సినిమా థియేటర్లో రన్ అవుతుంది. అలానే తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సంక్రాంతి కానుకగ వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కొంతమేరకు పరవాలేదు అనిపించుకుంది. రీసెంట్గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఏదేమైనా ఏడాదికో రెండేళ్లకు సినిమాలు చేస్తున్న ఈ తరుణంలో సరిగ్గా ప్లాన్ చేసుకుని కొంతమంది హీరోల నుంచి అయినా ఏడాదికి రెండు సినిమాలు రావటమనేది శుభ పరిణామం అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు