Prashant: “నీల్” కాదురా నిప్పు

2014 ఉగ్రం సినిమాతో కన్నడలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తన మొదటి సినిమాతోనే కమర్షియల్గా హిట్ అందుకొని మంచి దర్శకుడు అనిపించుకున్నాడు. నాలుగేళ్లు తర్వాత కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ప్రశాంత్. కేజీఎఫ్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అద్భుతమైన హీరో ఎలివేషన్స్, సాంగ్స్, షాట్స్ తో బీభత్సమైన హిట్ ను అందుకుంది కేజీఎఫ్ సినిమా.
మాస్ ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ను అందించింది కే జి ఎఫ్ సినిమా.

యష్ చెప్పిన డైలాగ్స్ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా కట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత వచ్చిన కే జి ఎఫ్ 2 కూడా అదే స్థాయిలో మంచి హిట్ అయింది. ఇకపోతే ప్రశాంత్ దర్శకత్వం వహించిన రీసెంట్ ఫిలిం సలార్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే బాహుబలి సినిమా తర్వాత సరైన హిట్ అందుకొని ప్రభాస్ కు ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.

అయితే ఇప్పటివరకు రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ కి ఉన్న కటౌట్ ని ఎవరు అద్భుతంగా వాడుకోలేదు. ప్రభాస్ కటౌట్ని అద్భుతంగా వాడుకుంటే సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనడానికి నిదర్శనం సలార్ సినిమా. అయితే సలార్ సినిమాలో ప్రభాస్ ని చూపించిన విధానం. యాక్షన్ సీన్స్, ప్రభాస్ డైలాగ్స్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ను వీటన్నిటిని అద్భుతంగా చూపించాడు ప్రశాంత్ నీల్.

- Advertisement -

చూడ్డానికి సాఫ్ట్ గా కనిపించిన ప్రశాంత్ నీల్ లో ఎటువంటి మాస్ యాక్షన్ డైరెక్టర్ ఉన్నాడని ఇదివరకే ప్రశాంత్ సినిమాలు ప్రూవ్ చేస్తూ వచ్చాయి. ఇకపోతే ప్రశాంత్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను చేయనున్నాడు. మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ తో సలార్ -2 ను తీసే పనిలో పడనున్నాడు ప్రశాంత్. ఏదేమైనా ప్రభాస్ ని కరెక్ట్ గా వాడుకొని అద్భుతంగా కొన్ని సీక్వెన్స్ డిజైన్ చేసి సినిమాను హిట్ దిశగా మార్చాడు ప్రశాంత్. ఇకపోతే ప్రశాంత్ నీల్ కాదు నిప్పు అంటూ కొంతమంది అభిమానులు ప్రశాంత్ ను కొనియాడుతున్నారు. ఏదేమైనా మొత్తానికి ప్రభాస్ అభిమానులకి చాలా ఏళ్ల తర్వాత ఒక హిట్టు వచ్చిందని చెప్పొచ్చు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు