OTT Releases : ఓటిటిలో రెండ్రోజుల్లో ఏకంగా 23 సినిమాలు !

ఓటిటి వచ్చాక టెలివిజన్ కు కాస్త డిమాండ్ తగ్గిందని చెప్పాలి. అలాగే సినీ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. థియేటర్లలో చూసిన సినిమాలు కేవలం వారాల వ్యవధిలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతూ ఉండడంతో ఓటిటిలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో పలు దిగ్గజ ఓటిటి నిర్వాహకులు కూడా తమ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ప్రతి ఫ్రైడే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటిలో రకరకాల జోనర్స్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఏకంగా ఈ వారం 23 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గురు, శుక్రవారాల్లో అంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక మరో ఐదు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు రానుండడం ఈ వారం స్పెషల్. అందులో నాగచైతన్య ధూత, జర హట్కే జర బచ్కే, 800, ఇండియానా జోన్స్ 5, మిషన్ రాణిగంజ్ వంటి 5 కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అమెజాన్ విషయానికి వస్తే… నవంబర్ 30న షహర్ లాకోట్ అనే హిందీ వెన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 1న క్యాండీ క్రేన్ లైన్ అనే ఇంగ్లీష్ మూవీ, నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ “ధూత” స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే… డిసెంబర్ 1న మాన్స్టర్ ఇన్సైడ్ అమెరికా స్మార్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్, ఇండియానా జోన్స్ అండ్ ది డైలాగ్ అఫ్ డెస్టినీ, ది షెఫర్డ్ అనే మూడు ఇంగ్లీష్ సినిమాలు రానున్నాయి.

- Advertisement -

ఇక జియో సినిమా విషయానికి వస్తే డిసెంబర్ 2న జర హట్కే జర బచ్కే అనే హిందీ మూవీ, 800 మూవీ తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

చివరగా నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే… నవంబర్ 29న బాడ్ సర్జన్ లవ్ అండర్ ది నైఫ్, అమెరికన్ సింఫనీ అనే రెండు ఇంగ్లీష్ మూవీస్ రాబోతున్నాయి. నవంబర్ 30న స్కూల్ స్పిరిట్ సీజన్ వన్ అనే వెబ్ సిరీస్, సీజన్ ది బిగ్ అగ్లీ 2022, హార్డ్ బెస్ట్ అనే జపనీస్ ఓబ్లేటెరేటడ్, ఫ్యామిలీ స్విచ్, అమెరికన్ సింఫనీ, ది బాడ్ గాయ్స్, వర్జిన్ రివర్స్ సీజన్ 5 పార్ట్ 2 అనే ఇంగ్లీష్ మూవీస్ రాబోతున్నాయి. డిసెంబర్ 1న మిషన్ రాణిగంజ్, స్వీట్ హోమ్ 2, బాస్కెట్ బాల్ వైవ్స్ 3, 4 సీజన్స్, ది ఈక్విలైజర్ 3 తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు