Animal Pre release event : మహేష్ టీషర్ట్ ధరెంతో తెలుసా ?

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి కొద్ది రోజుల్లో “యానిమల్” మూవీ థియేటర్లోకి రానుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినీ ప్రియులు కూడా ఈ మూవీ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో సక్సెస్ అందుకున్న సందీప్ చాలా గ్యాప్ తీసుకుని ‘యానిమల్’ అంటూ వైలెంట్ గా ప్రేక్షకులను ట్రీట్ చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు దర్శకు ధీరుడు రాజమౌళి కూడా గెస్ట్ గా హాజరయ్యారు.

హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున జరిగిన ఈవెంట్ లో మహేష్ బాబు క్యాజువల్ లుక్ లో స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఆయన వేసుకున్న షర్ట్ కు సంబంధించిన ధర గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కేవలం ఒక ప్లైన్ టీషర్ట్, జీన్స్ వేసుకుని వచ్చి రణవీర్ కపూర్ లాంటి బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోని సైతం స్టేజిపై డామినేట్ చేశాడు మహేష్. అయితే మహేష్ వేసుకున్న ఆ టీషర్ట్ చూడటానికి చాలా సింపుల్ గానే ఉంది. కానీ దాని ధర తెలిస్తే మాత్రం దిమ్మ తిరగడం ఖాయం. గివేంజి అనే బ్రాండ్ కు సంబంధించిన ఈ టీషర్ట్ చాలా కాస్ట్లీ. ఆ టీషర్ట్ ధర అక్షరాల రూ. 47,000 కావడం అందరికి షాకిచ్చే విషయం. చూడడానికి అంత సింపుల్ గా కనిపించినా ఆ టీషర్ట్ ధర తెలుసుకున్న వారికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు “గుంటూరు కారం” అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రానుంది. ఇక ‘యానిమల్’ మూవీ విషయానికొస్తే డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా, రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు