Orange: అప్పుడు డిసాస్టర్ .. ఇప్పుడు బ్లాక్బస్టర్

‘ఆరెంజ్’ ఇది ఒక కల్ట్ క్లాసిక్, ఎపిక్ సినిమా. ఈ సినిమా గురించి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ప్రతి పాట ఓ మాస్టర్ పీస్ గా ప్రేక్షకుల హృదయాల్లో ఈ రోజు వరకు నిలిచిపోయాయి. రాంచరణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిన సినిమా ఇది అని చెప్పొచు. 2010 లో విడుదులైన ఈ సినిమా అప్పట్లో డిసాస్టర్ గా నిలిచి, ప్రొడ్యూసర్ నాగబాబు కు తీరని నష్టాలను మిగిల్చింది. ఈ సమయంలో, ఓ సారి ఆత్మహత్య చేసుకోవాలి అని కూడా అనిపించిందని నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

అయితే ఈ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అయిన తర్వాత మెల్లిగా శ్రోతల మనసు దోచుకుంది. ప్రేమ కొంతకాలమే బాగుంటుందనే కాన్సెప్ట్ తో రియాలిటీ కి దగ్గరగా ఈ మూవీ తెరకెక్కించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారీస్ జైరాజ్ సంగీతం అందించారు. జెనీలియా హీరోయిన్ గా నటించగా, అవసరాల శ్రీనివాస్, నాగబాబు, ప్రభు, ప్రకాష్ రాజ్, సిద్ధూ జొన్నలగడ్డ బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఇప్పుడు,దాదాపు 13ఏళ్ళ తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే కానుక గా ఈ సినిమాని మార్చి 25,26,27 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో విడుదల చేసారు. అప్పుడు డిసాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో అల్ టైం రికార్డ్లను క్రియేట్ చేసింది ఈ సినిమా.

- Advertisement -

రీ రిలీజ్ సినిమాల్లో ఖుషి మొదట 12 లక్షల గ్రాస్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాత ఒక్కడు 17 లక్షల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. తాజాగా ఆరెంజ్ పవర్ స్టార్ను, సూపర్ స్టార్ ను దాటి 17.40 లక్షల గ్రాస్ వసూలు చేసి ఆల్టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ద్వారా వచ్చిన కల్లెక్షన్లని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారని నిర్మాత నాగబాబు తెలియచేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు