Bhanu Shri Mehra: వయస్సు దాటిన హీరోయిన్లు తల్లి పాత్రలకే పరిమితమా?

భాను శ్రీ మెహ్ర.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “వరుడు” సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. 2021 వరకు పలు తెలుగు చిత్రాలలో నటించినప్పటికీ ఆమెకు విజయం దక్కలేదు.

ఇక ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా నేటిజెన్లను అలరిస్తోంది. అంతేకాదు ఈమధ్య సోషల్ మీడియాలో కూడా వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడంటూ వార్తల్లోకి ఎక్కిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో అంశం గురించి ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి గురించి.. వయసు విషయంలో హీరోలకు, హీరోయిన్స్ కి మధ్య చూపిస్తున్న పక్షపాతం గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

“వయసు వచ్చిన స్త్రీలను, పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదిన పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వారికి సగం ఏజ్ ఉన్నా హీరోయిన్స్ తో లవ్ సీన్స్ చేస్తుంటారు. ఆడవాళ్లకు మాత్రమే ఎందుకు రూల్స్ పెడతారు? ఇకనైనా ఈ ధోరణి బ్రేక్ చేయండి. స్వతంత్రంగా జీవిస్తూ, మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న మహిళల కథలను చెప్పండి” అని ట్వీట్ చేసింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు