Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ రివ్యూ

ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారింది ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం. సందీప్ కిషన్ ఓ హిట్టు కోసం చాలా కాలంగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తూ ఈ సినిమా చేశాడు. తనకి టైగర్ వంటి డీసెంట్ సక్సెస్ అందించిన వి.ఐ.ఆనంద్ దర్శకుడు.అతను కూడా హిట్టు మొహం చూసి చాలా రోజులైంది. మరి ఈ ఇద్దరూ కలిసి ‘ఊరు పేరు భైరవకోన’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చారా లేదా? అనేది తెలుసుకుందాం రండి :

స్టోరీ:

బసవ (సందీప్ కిషన్) ఓ పెద్దింట్లో నగలు దొంగతనం చేస్తాడు. జాన్ (వైవా హర్ష) బసవ అసిస్టెంట్ లాంటోడు. నగల దొంగతనం తర్వాత తిరిగి తన కారులో వెళ్లిపోతుండగా.. మధ్యలో ఓ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడుతుంటుంది. ఆమె అగ్రహారం గీత (కావ్య థాపర్) ఓ దొంగ. విషయం తెలియక ఆమెను కూడా కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అనుకుంటాడు బసవ. కానీ మధ్యలో పోలీసులు బసవని కనిపెట్టి… అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. వారి నుండి తప్పించుకోబోయి దారి తప్పి పోతారు. అప్పుడు అనుకోకుండా ‘భైరవకోన’ అనే ఊరిలోకి వెళ్తారు. ఆ ఊరిలో వీరికి భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి? అవేంటి? ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు బసవ నగలు ఎందుకు దొంగతనం చేశాడు? భూమి ఎవరు? ఆమెకు బసవ చేసిన ద్రోహం ఏంటి? ఫైనల్ గా నారప్ప .. బసవకి చేసిన సాయం ఏంటి? అనేది మిగిలిన కథ

- Advertisement -

విశ్లేషణ:

హారర్ చిత్రాలకి, థ్రిల్లింగ్ చిత్రాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దర్శకుడు విఐ ఆనంద్ థ్రిల్లింగ్ సినిమాలని బాగా తెరకెక్కిస్తాడు అని అందరూ నమ్ముతారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తో ఈ విషయాన్ని అతను ప్రూవ్ చేశాడు. కానీ ఆ తర్వాత ‘ఒక్క క్షణం’ ‘డిస్కో రాజా’ చిత్రాలు ఆడలేదు. దీంతో మళ్ళీ తనకి కలిసొచ్చిన జానర్ నే ఎంపిక చేసుకున్నాడు. ఇక ‘ఊరు పేరు భైరవ కోన’ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ పరంగా విఐ ఆనంద్ పాస్ మార్కులు వేయించుకుంటాడు. అతని టేకింగ్ ఓ రేంజ్లో కాకపోయినా బాగానే మెప్పిస్తుంది. కానీ మెయిన్ కథ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ చేసేయడంతో.. సెకండ్ హాఫ్ లో ఏముంది? అనే అనుమానం అందరి ప్రేక్షకులకు కలుగుతుంది.

సో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండే నిరాశ పరుస్తూ సాగుతుంది. క్లైమాక్స్ ఓకే అనిపించినా.. మరీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రేంజ్లో లేకపోవడంతో ‘ఊరు పేరు భైరవకోన’ ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. ఈ సినిమాకి అందరి టెక్నిషియన్స్ కంటే ఎక్కువ న్యాయం చేసింది సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట వల్లే ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా పడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అతను న్యాయం చేశాడు. కానీ ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట ప్లేస్మెంట్ బాలేదు. ఆ పాటకి తగ్గ ఎమోషన్ అక్కడ పండలేదు. ఇక వి.ఎఫ్.ఎక్స్ కోసం ఈ సినిమా రిలీజ్ డిలే అయ్యింది అని మేకర్స్ కవర్ చేశారు. కానీ ఆ స్థాయిలో విజువల్స్ అయితే లేవు. ‘ఆదిపురుష్’ ని తలపించేలా అవి ఉన్నాయి అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే.. సందీప్ కిషన్ బాగానే నటించాడు. కానీ కొన్ని చోట్ల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ..లను అతను ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వర్ష బొల్లమ్మ పాత్రకి ప్రాముఖ్యత ఉన్నా స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేదు. కావ్య థాపర్ పాత్ర హీరోయిన్ కి తక్కువ సహాయ నటికి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. వైవా హర్ష ,వెన్నెల కిషోర్.. తమ మార్క్ కామెడీతో అక్కడక్కడా నవ్వించారు. ‘బొమ్మాళి’ రవి శంకర్ విలనిజం పెద్దగా పండలేదు. పెద్దమ్మగా వడివుక్కరసి ఓకే అనిపించింది. బ్రహ్మాజీ, సరయు, చమ్మక్ చంద్ర.. గెస్ట్ రోల్స్ కి పరిమితమయ్యారు అని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

కథ
ఫస్ట్ హాఫ్(కొంతవరకు)
సంగీతం
రన్ టైం(2 గంటల 15 నిమిషాలు)

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
పాటల ప్లేస్మెంట్

మొత్తంగా.. ‘ఊరు పేరు భైరవకోన’ లాజిక్స్ కి దూరంగా ఉంటుంది. కాబట్టి.. బి,సి సెంటర్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ..రేంజ్లో అయితే లేకపోవడం.. దాంతో కంపేర్ చేసి చిత్ర బృందం ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది అని చెప్పాలి. డైరెక్టర్ చెప్పినట్టు ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ..లు కూడా ఇందులో లేవు.

రేటింగ్ : 2.25/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు