Kavya Kalyan Ram : కావ్య కళ్యాణ్ రామ్ మతి పోగొట్టే ఫోజులు

కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలియనివారు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్గా మారింది. “మసుద” సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన “బలగం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్.

“బలగం” సినిమా సూపర్ హిట్ అవడంతో కావ్యకు మంచి గుర్తింపుతో పాటు క్రేజీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో “గంగోత్రి” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ సుందరి. “ఠాగూర్” సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పిల్లి కళ్ళ సుందరి. ఆ తర్వాత “స్నేహమంటే ఇదేరా”, “అడవి రాముడు”, “విజయేంద్ర వర్మ”, “సుభాష్ చంద్రబోస్”, “పాండురంగడు” వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. “బాలు” సినిమాలో కూడా మెప్పించింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది కావ్య కళ్యాణ్ రామ్. కాగా, కావ్య కళ్యాణ్ రామ్ ఇటీవలే రిలీజ్ అయిన “బలగం” సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కవ్వింపులతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేస్తోంది కావ్య కళ్యాణ్ రామ్. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ డోస్ పెంచేస్తోంది. వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల “ఉస్తాద్” మూవీలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తూ కుర్రాలను ఫిదా చేస్తోంది. ఇక తాజాగా క్రీమ్ కలర్ డ్రెస్సులో మెరిసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు