Om Bheem Bush: మినిమం డిగ్రీ అవసరం లేదు

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. వైవిధ్యమైన సినిమాలను చేసుకుంటూ తనకంటూ సొంత గుర్తింపును సాధించుకున్నాడు శ్రీ విష్ణు. అయితే శ్రీ విష్ణు కెరియర్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కానీ ఒక ఫేజ్ లో శ్రీ విష్ణు సినిమాలు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ శ్రీ విష్ణు నుంచి వచ్చిన సామజవరగమన సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇకపోతే ప్రతి హీరోకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అలా మాట్లాడుకుంటే శ్రీ విష్ణుకు ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. శ్రీ విష్ణు మాములుగా మాట్లాడితేనే నవ్వులు పువ్వులు పూయిస్తాడు. దానికి తోడు గోదావరి కాబట్టి కొంచెం వెటకారం కూడా తోడైయుంటుంది. అటువంటి శ్రీ విష్ణుకి కరక్ట్ కంటెంట్ ఉన్న సినిమా పడితే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఇదివరకే సామజవరగమన అనే సినిమాలో నిరూపించాడు.

ప్రస్తుతం శ్రీ విష్ణు చేస్తున్న సినిమా “ఓం బీమ్ బుష్”. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్ర టీజర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అని అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇంకా శ్రీ విష్ణు టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కొన్ని రియల్ లైఫ్ లో ఉన్న ఫన్నీ డైలాగ్స్ ని కూడా ఆడ్ చేశారు. “మినిమం డిగ్రీ ఉండాలి” “బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి రండి” లాంటి డైలాగ్స్ కొంచెం నవ్వు తెప్పిస్తాయి.

- Advertisement -

“ఓం బీమ్ బుష్” సినిమాను హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే హుషారు సినిమాతో తనదైన మార్క్ ను క్రియేట్ చేసి మంచి సక్సెస్ సాధించాడు హర్ష. హుషారు సినిమా తర్వాత హర్ష చేస్తున్న సినిమా ఇది కావడంతో చాలామందికి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే హుషారు సినిమా చాలామందికి ఎంజాయ్ చేశారు కాబట్టి. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకులు ముందుకు రానుంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు