Mohan Baabu: మీ పేరు “మా” ఎలక్షన్స్ లోనే వాడుకోలేదు ఇంకా జనరల్ ఎలక్షన్స్ లో వాడుకుంటారా.?

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చాలామందికి అయితే అసలు కలెక్షన్ కింగ్ అని బిరుదు ఎలా వచ్చిందో కూడా అర్థం కాదు. ఎందుకంటే మోహన్ బాబు సినిమాకి కలెక్షన్లు అంటే సాహసం అనే చెప్పాలి అనేటట్లు ఉంటాయి ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు. ఆయన చేసిన సన్నాఫ్ ఇండియా సినిమా గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు.

సినిమాల్లోనే కాకుండా సినిమా ఈవెంట్ లోను మోహన్ బాబు మాట్లాడే మాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. అంతేకాకుండా చాలామందిని బాధ కలిగించే విధంగా కూడా ఉంటాయి. ఏఎన్నార్ లాంటి వారు అప్పట్లో మోహన్ బాబు మాటలకి బాధపడ్డారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని గాడు అని సంబోధించడం మోహన్ బాబుకి అలవాటుగా మారింది. దీనిని ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ వ్యతిరేకిస్తారు.

ఇకపోతే మోహన్ బాబు తనను తాను గొప్పవాడిగా చెప్పుకోవడానికి ఎప్పుడు తగ్గరు. ఇక ఈ తరుణంలో ఆంధ్రప్రదేష్ లో ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే దానిపై కూడా ఈ విధంగా స్పందించారు మోహన్ బాబు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించు కుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది.
దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం.చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం.
నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ……

ధన్యవాదాలతో డా॥ మంచు మోహన్ బాబు

అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే మా ఎలక్షన్స్ లోనే మోహన్ బాబు సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా జనరల్ ఎలక్షన్స్ లో మోహన్ బాబు గురించి ఎవరు పట్టించుకుంటారనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు