NTR30: ఇంకెన్ని రోజులు దాగుడు మూతలు

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు మొత్తం ఎదురుచూస్తున్న సినిమా NTR30. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో తారక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కానీ, NTR30ని డైరెక్టర్ కొరటాల శివ ఇంకా స్టార్ట్ చేయడం లేదు. ఈ నెల 23న పూజా కార్యక్రమాలు జరుగుతాయని, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నోరు మెదపడం లేదు.

ఇది ఇలా ఉండగా, సినిమాలో హీరోయిన్ తో పాటు ఇతర పాత్రల గురించి కూడా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. గత కొన్ని రోజుల నుంచి చియాన్ విక్రమ్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్లు కనిపింబచోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇవి వినడానికి ఆసక్తికరంగా ఉన్నా.. దీనిపై కూడా అధికారిక ప్రకటన లేదు. ఇది ఇలా ఉండగా, NTR30 లో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న గత ఎనిమిది నెలల నుంచి వస్తూనే ఉంది.

ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ ను అనుకున్నారు. దీనిపై అప్పుడు ఆలియా కూడా అధికారికంగా చెప్పింది. కానీ, ఆలియా పెళ్లి, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీని తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పదుల సంఖ్యలో పేర్లు వినిపించాయి. అందులో ఎక్కువగా వినిపించిన పేరు.. జాన్వీ కపూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ తన తొలి సౌత్ మూవీ ఎన్టీఆర్ తోనే అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ పేరుతో పాటు మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

- Advertisement -

జాన్వీ, మృణాల్ లలో ఒక్కరిని ఫిక్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. హీరోయిన్ల విషయంలో ఇంకెన్నీ రోజులు దాగుడు మూతలు ఆడుతారు అంటూ ఫైర్ అవుతున్నారు. సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఎనిమిది నెలలు దాటుతున్నా.. సినిమా స్టార్ట్ కాలేదు.. సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే దానిపై క్లారిటీ లేదు.. హీరోయిన్ పేరు కూడా అనౌన్స్ చేయలేదు.. కనీసం టైటిల్ ను కూడా ప్రకటించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నెల 23న అయినా, ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుందా.. లేదా ఇంకా సమయం తీసుకుంటుందా అనేది చూడాలి మరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు