Sir: ప్రీరిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

స్టార్ హీరో ధనుష్ కు తమిళంలోనే కాకుండా మొత్తం సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాను ఎంచుకునే స్టోరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ధనుష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్ లోకి వస్తుంటాడు. కథ నాచుతే చాలు.. కొత్త పాత అని తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తాడు. తమిళం లో చాలా దర్శకులు ధనుష్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. అదే ధనుష్ ప్రత్యేకత. కాగా ధనుష్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రస్తుత రోజుల్లో ఎడ్యెకేషన్ సిస్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపే కథతో ధనుష్ వస్తున్నాడు. దీనికి “కేరింత” సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళంలో వాతి, తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

భీమ్లా నాయక్ చిత్రంతో పవన్ చెల్లిగా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన సంయుక్త.. ధనుష్ కి జోడిగా నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన “మాస్టారు మాస్టారు” అనే సాంగ్ ట్రేండింగ్ గా నిలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

- Advertisement -

“సార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 15న హైదరాబాద్ నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు