Niddhi Agerwal: ఈ హీరోయిన్ ఇంట్లో వేణు స్వామి.. వీడియో వైరల్

నిధి అగర్వాల్.. హైదరాబాద్ లోని మర్వాడి కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ 2017లో బాలీవుడ్ లో మున్నా మైఖేల్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇది యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో, టాలీవుడ్ వైపు వచ్చింది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో సవ్యసాచి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీంతో కూడా నిధి అగర్వాల్ హిట్ అందుకోలేదు. దీని తర్వాత మిస్టర్ మజ్ను కూడా నిరాశ పరిచింది. కానీ, రామ్ పోతినేనితో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ కెరీర్ లో మొదటి హిట్ ను అందించింది.

దీని తర్వాత అదే ఫామ్ కొనసాగిస్తుందని అనుకున్నారు. కానీ, ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన సినిమాలేవీ కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. దీన్ని భర్తీ చేయడానికి ఒక సినిమా కావాలి అని అనుకునే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం తన కెరీర్ లో లోటుగా ఉన్న బ్లాక్ బస్టర్ హిట్ ను భర్తీ చేస్తుందని అనుకుంది. కానీ, ఈ సినిమా ప్రారంభం అయిన నాటి నుంచి ఏదో ఒక సమస్యతో వాయిదా పడుతూనే ఉంది.

దీనికి కారణం తన జాతకమే అని అనుకుందట ఈ బ్యూటీ. అందుకు ప్రత్యేక పూజలను చేస్తుంది. సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామిని నిధి అగర్వాల్ ఇంటికి పిలిచి మరీ ఓ యాగం జరిపించుకుందట. నిధి అగర్వాల్ కెరీర్ సక్రమంగా సాగాలని, మంచి అవకాశాలు రావాలని వేణు స్వామి యాగం చేశాడని తెలుస్తోంది. వేణు స్వామి గతంలో నేషనల్ క్రష్ రష్మిక ఇంట్లో కూడా ఇలాంటి యాగం జరిపాడని అప్పట్లో పూకార్లు షికార్లు చేశాయి. తాజాగా నిధి అగర్వాల్ ఇంట్లో కూడా వేణు స్వామి పూజలు చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు