Niharika Divorce: ఈ సమయంలో ఫోటోషూట్.. ఏం చెప్పాలనుకుంది ?

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. ఒక మనసు మూవీ తో సినిమాలలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు సినిమాలలోనూ నటించి మెప్పించింది. ఇకపోతే గత కొద్ది రోజులుగా నిహారిక గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2020వ సంవత్సరంలో నిహారికకు జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో వివాహం చేశారు. ఎంతో అన్యాయంగా ఉన్న ఈ జంట ఈ మధ్యకాలంలో కలిసి కనిపించడం లేదు.

అంతేకాదు ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో గతవారం నిహారిక చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తన విడాకుల గురించి ఏమైనా ప్రస్తావించిందో అని అనుకున్నారు అంతా. కట్ చేస్తే నిహారిక అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ నిహారిక చేసిన పోస్ట్ ఏంటో తెలుసా.. తన కొత్త ప్రాజెక్టు గురించి. “డెడ్ పిక్సెల్స్” అనే టైటిల్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. విడాకుల గురించి రూమర్స్ వినిపిస్తున్న తరుణంలో ఆ విషయం గురించి ఏదైనా ప్రస్తావిస్తుందోనని అందరూ అనుకున్నారు.

కానీ అందరికీ షాక్ ఇస్తూ కొత్త ప్రాజెక్టు గురించి వెల్లడించింది నిహారిక. ఇక తాజాగా కొత్త ఫోటో షూట్ తో పిచ్చెక్కించింది నిహారిక. రెడ్ కలర్ లంగావోని లో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. ఎర్ర చీర కట్టి పిల్లర్ వద్ద కూర్చొని నిహారిక ఇచ్చిన ఫోజులు చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. అయితే ఓవైపు విడాకుల రూమర్స్ చెక్కర్లు కొడుతుండగా.. నిహారిక ఇలాంటి పిక్స్ షేర్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు నెటిజెన్లు. ఏదేమైనప్పటికీ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు