Samantha:సమంత ఇంత భయంతో బతికిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో తన పేరును పదిలం చేసుకున్న సమంతకు గత రెండేళ్లుగా ఎన్నో అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక కారణాలేవైనా కావచ్చు.. ఎంతో ఇష్టపడి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది సమంత. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది సమంత. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ పలు సంచలనమైన విషయాలను బయటపెట్టింది. గత మూడు సంవత్సరాలుగా తాను ఓ నియమం పెట్టుకున్నానని.. చాలా భయపడి ముందు ఆ భయాన్ని జయించి దాన్ని నిర్ణయించుకున్నానని తెలిపింది. అయితే ఏ అంశమైతే తనని భయపెట్టిందో దాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టానని.. ఈ మూడేళ్లలో వ్యక్తిగతంగా, సినిమాలపరంగా తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పుకొచ్చింది.

ఈ మూడేళ్లలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల పరిస్థితి నుంచి వ్యక్తిగతంగా మరింత రాటుదేలానని తెలిపింది. అయినప్పటికీ తనకి ఇంకా ఎన్నో భయాలు ఉన్నాయని.. వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా తన దగ్గర ఉందంటూ తెలిపింది. గత మూడేళ్లుగా తను ఎన్నో విషయాలలో భయపడ్డట్లు, వాటిని ఎదుర్కొన్నట్టు తెలిపింది. అయితే సమంత చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విడాకులకు దాదాపు ఏడాది ముందు నుండే ఆమె ఎన్నో ఇబ్బందులకు గురైందని, అక్కినేని కుటుంబంలో సర్దుబాటు కాలేకపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు