Narakasura First Review: ఎలా ఉందంటే..!

రక్షిత్ అట్లూరి హీరోగా మలయాళీ డైరెక్టర్ సెబాస్టియన్ డైరెక్షన్లో రూపొందిన సినిమా నరకాసుర. రూరల్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇటీవల ప్రీమియర్స్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి కూడా ప్రీమియర్స్ వేసింది సినిమా యూనిట్.

ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ కష్టం తెర మీద కనపడింది, పలాస తర్వాత హీరో రక్షిత్ అట్లూరికి మంచి బ్రేక్ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. కథలో కొత్తదనమేమి లేకపోయినా డైరెక్టర్ డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని చివరి వరకు ఎంగేజ్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయనే చెప్పాలి.

ఇటీవలి కాలంలో ప్రీమియర్స్ ద్వారా మంచి రెస్పాన్స్ అందుకున్న చాలా చిన్న సినిమాల లాగే ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ అందుకోవటం ప్లస్ అవుతుందని చెప్పాలి. పైగా అదే రోజు రిలీజ్ కానున్న కీడా కోలా సినిమాకి ప్రీమియర్స్ ద్వారా నెగిటివ్ రెస్పాన్స్ రావటం మరింత ప్లస్ అవుతుందని చెప్పాలి. వాస్తవానికి ఎబోవ్ యావరేజ్ కంటెంట్ ఉన్న ఈ సినిమా కీడకోలా ఫెయిల్యూర్ అవ్వటం వల్ల హిట్ దిశగా అడుగులేసే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చేతికి గాయం అయినప్పటికీ వెనకడుగు వేయకుండా సినిమా కంప్లీట్ చేసినందుకు గాను తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పాలి. ప్రమోషన్స్ కూడా లో ప్రొఫైల్ లో చేసిన ఈ సినిమాకి ప్రీమియర్స్ ద్వారా వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అయితే ఫస్ట్ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, ప్రీమియర్ షోస్ తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా రిలీజయ్యాక ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు