#VarunLav: పవన్ వెళ్ళింది పెళ్లికేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుక ఇటలీలో అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. ఇప్పటికే రిలీజైన వరుణ్ లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఇంటర్నెట్లో మెగాఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోలు కనిపిస్తున్నాయి కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం కనిపించట్లేదు. దీంతో అసలు పవన్ కళ్యాణ్ ఇటలీకి వెళ్ళింది వరుణ్, లావణ్యల పెళ్లికేనా అని ఫ్యాన్స్ సైతం సందేహ పడుతున్నారు.

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి దూరంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో వరుణ్ లావణ్యల పెళ్ళికి ఇటలీ వెళ్లాడని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటిది, మొన్న ఎయిర్ పోర్ట్ లో భార్యతో కలిసి ఇటలీ వెళ్తున్న ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోలు కనిపిస్తున్నాయి కానీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు రాకపోవటంతో సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ పెళ్ళికి ఇటలీకి వెళ్లినందుకు ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నప్పటికీ పెళ్లి వేడుకలో పవన్ ఫోటోలు కనిపించకపోవడం కొంత నిరాశ కు లోనవుతున్నారు. మరి, పెళ్లి అయ్యాకనైనా పవన్ ఫోటోలు బయటికి వస్తాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు