Effects Of Drinking Alcohol Before Bed: రోజూ రాత్రి ఆల్కహాల్ తీసుకుంటున్నారా..?

ఈ రోజుల్లో మద్యపానం సర్వ సాధారణం అయిపోయింది. చిన్న-పెద్ద, ఆడ-మగ, అన్న తేడా లేకుండా అందరిలో ఈ అలవాటు పెరిగిపోతోంది. మొదట సరదాగా మొదలయ్యి, ఆ తర్వాత అలవాటుగా మారి, వ్యసనంగా తయారవుతుంది. మద్యపానం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకోవటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా తలెత్తుతుంది.మద్యపానం అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ సమస్యలన్నిటి కంటే చాప కింద నీరులా వ్యాపించే సమస్య నిద్ర లేమి సమస్య. నిద్రలేమి వల్ల కలిగే అనర్థాలు బయటికి తెలియకుండా ముంచుకొచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తాత్కాలికంగా నిద్ర వచ్చినప్పటికీ అది ఆరోగ్యకరమైన నిద్ర కాదు.

ఆల్కహాల్ వల్ల REM స్లీప్ ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

- Advertisement -

ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మాటిమాటికి మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

ఆల్కహాల్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి దెబ్బ తింటుంది:

ఆరోగ్యకరమైన నిద్రను మనకి అందించటంలో మెలటోనిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి దెబ్బతిని సహజంగా నిద్రకు ఉపక్రమించే లక్షణాన్ని మన బాడీ కోల్పోతుంది.

REM స్లీప్ ని బ్లాక్ చేస్తుంది:

REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. దీని వల్ల జ్ఞాపకశక్తి, లెర్నింగ్ ఎబిలిటీస్ ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఇది కంట్రోల్ తప్పటం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.

కిడ్నీ సమస్యలు:

ఆల్కహాల్ నైట్ టైమ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మాటిమాటికి మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్కహాల్ కి బానిసైన వారిలో వాసోప్రెస్సిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల మన బాడీలో వాటర్ అబ్సర్బింగ్ కెపాసిటీ తగ్గి కిడ్నీ సమస్యలు వస్తాయి.

బ్రీతింగ్ ప్రాబ్లమ్స్:

ఆల్కహాల్ వల్ల నర్వస్ సిస్టం డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల హార్ట్ రేట్ అండ్ రెస్పిరేటరీ దెబ్బ తిని బ్రీతింగ్ సమస్యలు తలెత్తుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు