Deepika Padukone: పెళ్లికంటే ముందే దీపిక పదుకొనే ఇంతమందితో ఎఫైర్ పెట్టుకుందా..?

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2007లో “ఓం శాంతి ఓం” సినిమాతో బాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన దీపిక పదుకొనే బాలీవుడ్ మరియు హాలీవుడ్ రెండింటిలో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈమె తన 15 ఏళ్ల సినీ కెరీర్ లో 37 సినిమాలలో నటించి 52 అవార్డులను గెలుచుకుంది. ఇక 2018లో ఈ ముద్దుగుమ్మ రణవీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.

అయితే దీపిక సినిమా లైఫ్ ఎంత హాట్ టాపిక్ అవుతుందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే చర్చనీయాంశం అవుతుంది. ఈమె రణ్వీర్ తో పెళ్లి కంటే ముందు ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురుతో ఎఫైర్ పెట్టుకుని వార్తల్లోకి ఎక్కింది. ఈమె ఎఫైర్ పెట్టుకున్న ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఉపెన్ పటేల్:

- Advertisement -

దీపిక – మోడల్ యాక్టర్ ఉపెన్ పటేల్ ఫోటోషూట్ వారి మధ్య ఏదో ఉందన్న పుకార్లకు ఆజ్యంపోసింది. ఇతను ఎవరో కాదు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన “ఐ” సినిమాలో విలన్ గా నటించాడు.

యువరాజ్ సింగ్:

క్రికెటర్ యువరాజ్ సింగ్ తో దీపికకు రొమాంటిక్ కనెక్షన్ ఉండేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వారి బిజీ షెడ్యూల్ చివరికి వారి విడిపోవడానికి దారితీసిందని.. ఆ తర్వాత యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ గురించి మాట్లాడాడు.

ఎం.ఎస్ ధోని:

క్రికెటర్ ఎంఎస్ ధోనితో దీపిక డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో ఆమె బహిరంగంగానే ధోని పట్ల తన అభిమానం వ్యక్తం చేసింది. వారి మధ్య రిలేషన్షిప్ ఉన్నట్లు తెలియరాలేదు.

నిహార్ పాండ్యా:

ముంబై వ్యాపారవేత్త నిహార్ పాండ్యాతో దీపిక ఎఫైర్ నడిపిందని.. వీరిద్దరూ మూడు సంవత్సరాలు కలిసి తిరిగారు. ఆ తర్వాత ఏమైందో కానీ నిహార్ దీపికకు బ్రేకప్ చెప్పి సింగర్ నీతి మోహన్ ని పెళ్లాడాడు.

ముజామిల్ ఇబ్రహీం:

కాశ్మీర్ మోడల్ యాక్టర్ ముజామిల్ ఇబ్రహీం – దీపిక మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది. 2007లో ఇబ్రహీం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత సంబంధాల గురించి, దీపికతో తనకు ఉన్న అనుబంధం గురించి నిజాయితీగా చర్చించాడు. అయితే ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే దీపిక ప్రధాన పాత్ర పోషించినందున అతను ” ఏ జవానీ హై దివానీ” చిత్రంలోని ఓ పాత్రను తిరస్కరించాడు.

సిద్ధార్థ్ మాల్యా:

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా – దీపిక మధ్య డేటింగ్ నడిచిందన్న పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వారి ముద్దు సన్నివేశం బాగా హైలైట్ అయింది.

రణబీర్ కపూర్:

దీపిక ప్రేమ జీవితంలో రణబీర్ కపూర్ చాలా ముఖ్యమైనవాడు. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అతనిపై తనకు ఉన్న ప్రేమకు చిహ్నంగా దీపిక తన మెడపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. అలా రెండేళ్ల పాటు డేటింగ్ చేశాక 2009లో వీరిద్దరూ విడిపోయారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు