Best Anti-Aging Foods: ఇవి తింటే ఎప్పటికీ మీరు యూత్ గానే కనిపిస్తారు

మనిషి శరీరంలో ఎవరైనా మొట్ట మొదటిగా చూసేది మన చర్మం. అలాగే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరిగినా సరే, మొదటగా కనిపించేది కూడా ఆ చర్మమే. మనం మన శరీరానికి మంచి ఆహారం… అంటే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి మంచి జరుగుతుంది. ఆ ప్రభావం చర్మంపైన చూపుతుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎలా ఉంటుందో, మన అలవాట్లు ఎలా ఉన్నాయో అని మన చర్మం ని చూసి అంచనా వేసేయచ్చు.

మన శరీరం తో పాటు మన చర్మం పైన కూడా వయసుతో వచ్చే మార్పుల ప్రభావం అనేది ఉంటుంది. ఇది కొందరిలో త్వరగా మొదలవుతుంది, మరి కొందరిలో కాస్త అలస్యం గా మొదలవుతుంది. కానీ వయసు ప్రభావం ఏదో ఒక సమయం లో మన చర్మం పైనా పడుతోంది. ఈ ప్రక్రియ కొంత మనం అదుపు చేయవచ్చు. మన ఆహారపు అలవాట్లతో కానీ, ఫుడ్ పరంగా మనం తీసుకునే కేర్ తో గానీ, ఈ ఏజింగ్ ని అదుపు చేయవచ్చు.

మన చర్మం మధ్యలో కొల్లాజెన్ అనే పథార్ధం మన చర్మం మృదువుగా, స్మూత్ గా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇక ఈ కొల్లాజెన్ అనేది వయసు పెరిగేకొద్దీ, తగ్గిపోతూ ఉంటుంది. యాంటీ ఏజింగ్ కి తోడ్పడే ఆహారం పదార్ధాలలో ఎన్నో రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సహజంగా కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసే గుణాలు ఉంటాయి. విటమిన్ సి కలిపిన ఆహారం తీసుకోవటం కూడా ఈ ప్రక్రియలో తొడపడుతుంది.

- Advertisement -

యాంటీ ఏజింగ్ కి ఉపయోగపడే 7 ఆహార పథార్ధాలు

1. చేప

సాల్మన్, మార్కెల్, తునా వంటి చేపల్లో ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇది చర్మ కాంతిని పెంపొందించుటకు తోడ్పడుతుంది. ఈ యాసిడ్లు చర్మంలోని వాటిని కాపాడి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఇ, జింక్ గుణాలు కూడా ఉంటాయి, ఇవి గాయలను మాన్పించేందుకూ తోడ్పడతాయి. వీటి వల్ల మోటిమలు, మచ్చలు లేకుండా చర్మం మెరుస్తూ ఉంటుంది.

2. అవకాడోలు

అవొకాడో అనేది రుచికరమైన పండు మాత్రమే కాదు. అందులో ఎన్నే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అవకాడోలు తినడం వల్ల మన చర్మంపై తేమను కాపాడి, చర్మాన్ని కాంతివంతంగా చూపిస్తుంది. ఈ పండులోని విటమిన్ A,B,C,E,K లు… సూర్య కిరణాల నుండి వచ్చే హాని కారమైన రష్మి వల్ల వచ్చే సమస్యల నుండి కూడా విముక్తి ఇస్తుంది.

3. టమోటాలు

టమోటా అనేది సర్వ సాధనంగా అందరికి అందుబాటులో ఉండే ఆహారం. ఇందులోని లైకోపెన్, మన చర్మాన్ని ఎన్నో రకాల హానీకారమైన సూర్య రష్మి నుండి రక్షించి, స్కిన్ ని డ్యామేజ్ జరగకుండా చూసుకుంటుంది.

4. బ్రోకలీ

బ్రోకలీ ని ఎన్నో డైట్ ప్లాన్ల్ లలో ప్రధానం గా వాడుతారు. అయితే ఇందులో దాగి ఉన్న ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇందులో ఉన్న విటమిన్ C, K మన చర్మం పై ముడతలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది.

5. స్వీట్ పొటాటోస్

స్కిన్ హెల్త్ కి తోడ్పడే ఎన్నో గుణాలు స్వీట్ పొటాటోస్ లో ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇందులోని విటమిన్ A, కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసి, చర్మానికి గ్లో ని ఇస్తుంది.

6. డార్క్ చాక్లేట్

డార్క్ చాక్లెట్ లో మనకి తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి, చర్మానికి మంచి చేసే గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వాళ్ళ, సరైన మోతాదు లో చాక్లెట్ ని తీసుకుంటే, చర్మం పై ముడతలు, మచ్చలు, మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఇది మన చర్మం పై తేమని కాపాడుతూ, హానికరమైన సూర్య రశ్మి వాళ్ళ జరిగే స్కిన్ డామేజ్ ని కూడా రిపేర్ చేస్తుంది.

7. నట్స్

నట్స్ లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని అందరికి తెలుసు. ఇందులో ఉండే విటమిన్ E అనేది హాని కరమైన సూర్యా రశ్మి నుంచి చర్మం డ్యామేజ్ అవ్వకుండా చేసుకుంటుంది. అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ కలిగి ఉన్న వాల్నట్.. వల్ల చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు