Nani’s Heroine: ఆ పని చేస్తేనే హీరోయిన్ అవుతాం..

నాని హీరోగా నటించిన స్నేహితుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మాధవి లత. అప్పట్లో ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో మాధవి లత అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మాధవి లత ఒకటి రెండు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయలేదు. కానీ తెలుగు అమ్మాయి కావడంతో మాధవి లత ముందునుండి అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మాధవి లత తరచూ సినిమాలపై, రాజకీయాలపై, సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది హీరోయిన్ మాధవి లత. కమిట్మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని, కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేశారని చెబుతుంది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అని అర్థానికి దిగజార్చారని చెబుతుంది మాధవి లత. నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం.

కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేస్తున్నారు అంటుంది ఈమె. తనకు కూడా ఈ ఇబ్బందులు వచ్చాయని, అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది మాధవి లత. అయితే వాళ్ళ ఆలోచన అర్థం చేసుకొని నో చెప్పినట్లు తెలిపింది. ఈమె మొత్తానికి పడకగదికి వెళ్లి వాళ్ళ కామ వాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు ఎక్కడ హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని చెబుతుంది ఈ బ్యూటీ.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు