Pawan Kalyan: పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటుడు దర్శకుడు అయిన సముద్రఖని దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వస్తున్న మల్టిస్టారర్ చిత్రమిది. సముద్రఖని దర్శకత్వం వహించిన వినోదయ సీతం సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారం పనుల్లో ఉంటూనే మధ్యలో సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నాడు, గత నెల ఫిబ్రవరి లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఈ మధ్యనే లీకైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల వర్కింగ్ స్టిల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ గోపాల గోపాల మూవీలో లాంటి పాత్ర చేస్తున్నారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో విశ్వ ప్రసాద్ , వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు, అయితే నిన్న సాయంత్రం అనగా 24 న ఈ సినిమా మేకర్స్ ట్విట్టర్ వేదిక గా రిలీజ్ డేట్ ను కంఫర్మ్ చేసారు. జులై 28 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కానీ సినిమా ను ఇంత తొందరగా రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషి తో పాటు కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తూనే ఈ సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నాడు, అటు సాయిధరమ్ తేజ్ తాను నటించిన విరూపాక్ష విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కంటే ముందే ఈ చిత్రం విడుదల అవబోతుండడం విశేషం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు