Nani: ఇదే జరిగితే టైర్2 హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్ గ్యారంటీ

టాలీవుడ్ లో హీరోల మధ్య కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి, పాన్ ఇండియా మార్కెట్ లో పాగ వేయాలని చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మందికి నిరాశ ఎదురైతేే, మరి కొంత మంది క్లిక్ అవుతున్నారు. రామ్ చరణ్, తారక్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి టైర్ 1 హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. అక్కడ వీరికి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టారు.

అందులో ప్రస్తుతం నాని ముందు వరుసలో ఉన్నాడు. నాని నుంచి ఈ నెల 30న దసరా మూవీ వస్తున్న విషయం తెలిసిందే. దసరా టీం ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 30 కోట్లు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ఒక వేళ ఇదే జరిగితే టైర్ 2 హీరోల్లో నానినే నెంబర్ వన్ అవుతాడు. టైర్ 2 హీరోల్లో ఇప్పటి వరకి ఎవరికీ కూడా ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్లు రాలేదు. ఈ కేటగిరిలో మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ తన లైగర్ మూవీతో ఉన్నాడు. ఈ మూవీకి ఫస్ట్ డే 23 కోట్ల వసూళ్లు వచ్చాయి.

విజయ్ తర్వాత, 17 కోట్లతో నాగ చైతన్య (బంగర్రాజు, లవ్ స్టోరీ), అదే 17 కోట్లతో వైష్ణవ్ తేజ్ (ఉప్పెన) ఉన్నాడు. దీని తర్వాత స్థానంలో 16 కోట్లతో విజయ్ దేవరకొండ (డియర్ కామ్రేడ్), నాని (ఎంసీఏ) ఉన్నాడు. మరి దసరా మూవీ నానిని కింది నుంచి టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తుందో లేదో చూడాలి.

- Advertisement -

నిజానికి దసరా సినిమా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాలు ఉన్నాయి. పోస్టర్ల నుంచే సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఇక తర్వాత వచ్చిన టీజర్.. ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో సినిమాకు తొలి రోజు 30 కోట్ల కలెక్షన్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు