Raviteja: వచ్చేస్తున్న రావణాసుర ట్రైలర్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పైన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఎమాన్యుయెల్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో సుశాంత్ తొలిసారిగా విలన్ గా కనిపించనున్నారు. అలాగే సంపత్ రాజ్, మురళి శర్మ, జయరాం, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ధమాకా, వాల్తేరు వీరేయ్య ల విజయం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కి నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన రావణాసుర టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది.

ఇక నిన్న రవితేజ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా కి సంబంధిచిన ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మర్చి 28న సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే సమ్మర్ కానుక గా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఈ చిత్ర యూనిట్ ముందే ప్రకటిచారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఇంకా సాంగ్స్ తో మంచి హైప్ వచ్చిన ఈ సినిమాకి ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోవడం ఖాయం

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు