Kollywood: స్ట్రాంగ్ రిలేషన్‌లో ధనుష్, మీనా.. వ్యవహరం పెళ్లి వరకు ?

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1982లోనే కెరీర్ ప్రారంభించిన మీనా, ఇటీవల ఇండస్ట్రీలో 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈమె కెరీర్ లో దాదాపు స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. ఈమె నుంచి రీసెంట్ గా బ్రో డాడి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంతంగా సాగుతున్న మీనా జీవితంలో 2022 పెద్ద సునామీనే తీసుకువచ్చిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలోనే మీనా భర్త విద్య సాగర్ మరణించాడు.

మీనా భర్త మరణించిన తర్వాత, ఈమె రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ నటుడు బెయిల్వన్ రంగనాథన్.. మీనా పెళ్లిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. మీనా రెండో పెళ్లికి సిద్ధమైందని, వరుడు కోలీవుడ్ లో లీడింగ్ హీరో అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అంతే కాదు.. ఆ హీరో ఎవరో కాదు.. ఇటీవల సార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధనుష్ అని రంగనాథన్ చెప్పాడు.

ధనుష్ తో మీనా రిలేషన్ షిప్ లో ఉన్నారని, అన్ని కుదిరితే ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకుంటారని కూడా వాగాడు. అలాగే ధనుష్, ఐశ్వర్య రాజేష్ డైవర్స్ అవుతున్నాయని, ఐశ్వర్య కూడా వేరే వారితో రిలేషన్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఐశ్వర్య రజినీకాంత్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు మంచి సంబంధం ఉందని అన్నాడు. అలాగే కొరియేగ్రాఫర్ ప్రభుదేవతో కూడా ఐశ్వర్య మంచి రిలేషన్ షిప్ మెంటేన్ చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఐశ్వర్య పెళ్లి చేసుకుంటుందని అన్నాడు.

- Advertisement -

బెయిల్వన్ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ధనుష్ ఫ్యాన్స్, కోలీవుడ్ ప్రేమికులు రంగనాథన్ వ్యాఖ్యలపై గట్టిగా స్పందిస్తున్నారు. ఫేమస్ అవ్వడానికి, యూట్యూబ్ ల వ్యూస్ రావడానికి ఇలా నీచంగా మాట్లాడుతారా అంటూ ఫైర్ అవుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు