Nayanthara: భర్త కోసం డేరింగ్ స్టెప్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏ ముహూర్తాన డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిందో కానీ అప్పటినుంచి నయనతార పేరు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంది. మ్యాటర్ ఏదైనా నయన్ కచ్చితంగా ట్రోల్ అవ్వాల్సిందే. అలాంటి పొజిషన్ లో ఉంది నయనతార. సినిమాల పరంగా ఈ అమ్మడు సూపర్ గుడ్. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తూ సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఈమె.

అయితే తాజాగా నయనతార తన భర్త కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నయనతార చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో బికినీలో కనిపించడానికి సైతం సిద్ధమైందట. ఈమెకి ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే భర్త ఖాళీగా ఉండి భార్య బడా హీరోయిన్ గా మారిపోతూ ఉండడంతో.. విగ్నేష్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారట. ఈ క్రమంలోనే భర్త కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో భర్తను బాధ పెట్టకుండా ఉండడానికి నయనతార కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విగ్నేష్ ని స్టార్ డైరెక్టర్గా మార్చడానికి ప్లాన్స్ చేస్తుందట. తన ఫాలోయింగ్ ని ఉపయోగించి భర్తకు మంచి అవకాశాలు వచ్చేలా ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలోనే మరోసారి కోలీవుడ్ మీడియాలో నయనతార పేరు వైరల్ గా మారింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు