Naga chaithanya : ఆ హీరోయిన్ అంటే నాగ చైతన్యకి చచ్చేంత ఇష్టమట !

నాగ చైతన్య హీరోగా , తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తోన్న సినిమా కస్టడీ. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కస్టడీ సినిమా ఈ నెల 12న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా నాగ చైతన్య అండ్ కస్టడీ మూవీ టీమ్, సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సందర్బంగా నాగ చైతన్య తన సీక్రెట్ క్రష్ రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

గత వారం రిలీజ్ అయిన అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా అక్కినేని అభిమానులని నీరాశపరచటంతో ఇప్పుడు అందరు నాగ చైతన్య కస్టడీ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ టైం అస్సలు బాగాలేదు. చేసిన సినిమాలన్నీ ఒక సినిమా మించి ఇంకోటి ప్లాప్ అవుతూనే వస్తున్నాయి. గతేడాది రిలీజ్ అయినా బంగార్రాజు సినిమా మినహా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులని మెప్పించ లేకపోయింది. అందులోనూ యాక్షన్ జానర్ వీళ్ళకి అస్సలు అచ్చిరాని జానర్ గా మారిపోయింది. నాగార్జున ఘోస్ట్ సినిమా, అఖిల్ ఏజెంట్, ఇలా వీళ్ళు గన్ పట్టుకున్న ప్రతి సినిమా తూటాలని రివర్స్ లోనే పేలుస్తుంది. ఇప్పుడు మరి అదే గన్ పట్టుకొని పోలీస్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు నాగ చైతన్య.

కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగ చైతన్య పలు ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. మీ ఫ్యామిలీ కి బ్యాడ్ టైం నడుస్తుందా అని సూటిపోటి మాటలతో మీడియా ప్రశ్నించిన కూడా గెలుపు, ఓటములు ఎక్కడైనా సర్వధారణం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే “మీ సీక్రెట్ క్రష్ ఎవరు” అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన ” సీక్రెట్ ఏమి లేదండి, నేను ఈ మధ్యనే బాబిలోన్ అని ఒక ఇంగ్లీష్ మూవీ చూసాను అందులో హీరోయిన్ గా చేసిన మర్గోట్ రాబీ పర్ఫామెన్స్ నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఆమె నా క్రష్” అంటూ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు