Shalini pandey: అర్జున్ రెడ్డి లవర్ ని మిస్ అవుతున్న అభిమానులు !

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2017లో రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా బాలీవుడ్ లో సినిమా తీసే స్థాయికి వెళ్ళాడు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది.

షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామకి అర్జున్ రెడ్డి సినిమాకి గాను బెస్ట్ ఫీమేల్ లీడ్ గా అవార్డ్ కూడా వచ్చింది, కానీ..మరెందుకో ఆఫర్స్ మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలిని తెలుగులో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఆ తరువాత ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 118 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కూడా షాలినికి పెద్దగా ఆఫర్స్ ఏమి రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆక్కడ కూడా రెండు, మూడు సినిమాలు చేసి హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ కోలీవుడ్ కూడా ఆమెకి అచ్చిరాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అవడంతో షాలిని కెరీర్ మళ్ళీ చిక్కుల్లో పడిపోయింది. అయితే సోనాక్షి సిన్హా లీడ్ రోల్ నటిస్తున్న “దాహద్” అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా షాలిని అమెజాన్ ప్రైమ్ తరుపున ఈ సిరీస్ ని ప్రమోట్ చేసింది. చాలా రోజుల ఆమె ఇంస్టాగ్రామ్ లో ఇలా ప్రమోషన్ సంబంధిత పోస్ట్ పెట్టేసరికి ఆమె అభిమానులు “ప్రమోషన్స్ కాకుండా సినిమాలు చెయ్ షాలిని నిన్ను మిస్ అవుతున్నం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు