Megastar: చిరు సినిమాలో యంగ్ హీరో…?

వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న తర్వాత స్పీడ్ పెంచిన మెగాస్టార్ చిరంజీవి, చాలా మంది యువ దర్శకుల కథలు వింటూ నచ్చిన వాటిని ఓకే చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల వినిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరంజీవి. ఆ కథలో ఒక యంగ్ హీరో కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని, ఆ పాత్ర కోసం సిద్ధూ జొన్నలగడ్డ పేరుని పరిశీలనలో ఉంచినట్టు సమాచారం అందుతోంది. సోగ్గాడే మినహా ఒక్క హిట్ కూడా లేని కళ్యాణ్ కృష్ణకి చిరంజీవి ఛాన్స్ ఇవ్వటం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సిద్ధుకి చిరు సినిమాలో రోల్ ఉన్న మాట నిజమే అయితే సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ చిరుకి చీలీలుగా తమన్న చిరు సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ప్రభావంతో ట్రాక్ మార్చిన చిరంజీవి తన తదుపరి సినిమాల అనౌన్సమెంట్ విషయంలో చాల జాగ్రత్తగా ఉన్నారని సమాచారం.

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కి ఛాన్స్ ఇచ్చి హిట్ అందుకున్న చిరంజీవి, కళ్యాణ్ కృష్ణతో చేసే సినిమాకి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది తెలియాలంటే భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు