Power Star: శరవేగంగా ఉస్తాద్ – అసలు ఊసే లేని హరిహర వీరమల్లు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘, సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’, సినిమాలను లైన్లో పెట్టాడు పవర్ స్టార్. ఇవే కాకుండా సాయి ధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో ‘వినోదాయ సీతాం’ అనే తమిళ సినిమా రీమేక్ లో కూడా నటించాడు. అయితే, ఇటీవల ప్రారంభమైన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు శరవేగంగా జరుపుకుంటుంటే, చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం నత్త నడకన సాగుతోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇదిలా ఉండగా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూలు స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తమిళ సినిమా తేరి కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గ్యాప్ లేకుండా సినిమాల షూటింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రిలీజ్ విషయంలో మాత్రం సినిమా సినిమాకు మినిమమ్ గ్యాప్ ఉండాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ట్రై చేయని జానర్లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ తో సహా సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా గురించి ఫస్ట్ లుక్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవటం వల్ల ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు