Naga Chaitanya: చైతూ రిలేషన్ లో వున్నారా..ఆ మాటలకు అర్థం..!

టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సమంతతో ప్రేమాయణం, పెళ్లి తర్వాత మంచి క్రేజ్ ని అందుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడంతో పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. అలా విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య మీద ఎన్నో డౌట్లు సైతం అభిమానులకు, నెటిజనులకు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా నాగచైతన్య రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటి.. ఈ హీరో ఇంత చట్టపట్టలేసుకొని తిరుగుతూ.. సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరు ఏమనుకున్నా నాగచైతన్య ఈ విషయం పైన స్పందిస్తే బాగుంటుందని అభిమానులు సైతం తెలుపుతున్నారు. అయితే తాజాగా నాగచైతన్య కి సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు చూస్తే అదంతా నిజమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమధ్య చైతన్య ఎవరితోనో ఫోటో దిగి.. షేర్ చేసిన ఫోటోలలో కూడా యంగ్ హీరోయిన్ శోభితనే ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో రిలేషన్షిప్ స్టేటస్ గురించి నాగచైతన్య దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకురావడంతో ఒక ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేయడం జరిగింది.

ఈ విషయంలో నాగచైతన్య ఏం చెప్పారంటే.. తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి విషయాలు జరిగిన తాను కచ్చితంగా స్వయంగానే వెల్లడిస్తానని.. అందులో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎవరి గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగిపోను అంటూ తెలియజేయడం జరిగింది.. తనపై వచ్చిన రూమర్ల గురించి నాగచైతన్య స్పందించాడు.. తన గురించి ఎవరేమనుకున్నా సరే ఎలాంటి రూమర్స్ వచ్చిన తాను పట్టించుకోనని ప్రస్తుతానికి తన దృష్టి అంత ఎక్కువగా సినిమాల పైన ఉందంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

కానీ నాగచైతన్య తాను రిలేషన్ షిప్ లో లేనని మాత్రం చెప్పలేదు.. అంతేకాకుండా రిలేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తనకు సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని మాత్రమే తెలియజేశారు. ఎక్కువగా నాగచైతన్య ఈ మధ్యకాలంలో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతు సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా సమంత, నాగచైతన్య విడిపోవడం మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశ ను మిగిల్చిందని చెప్పవచ్చు. చాలామంది సెలబ్రిటీలు కూడా వీరిద్దరు విడిపోవడంపై ఆశ్చర్యపోయారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు