Myhtri movie makers : “8 వసంతాలు”.. ఇంట్రెస్టింగ్ గా కాన్సెప్ట్ పోస్టర్..!

8 Vasanthalu : 

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు, దర్శకులతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో తమకంటూ ఓ ఫేమ్ ని ఒక బ్రాండ్ వ్యాల్యూ ఉన్న సంస్థ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఇటు చిన్న సినిమాలు, కంటెంట్ ఉండే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. మూవీ స్క్రిప్ట్ నచ్చితే ఖర్చుకు వెనకారని ఈ మూవీ మేకర్స్ ప్రేమికుల రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేయడం జరిగింది.

ముందుగా వాలెంటైన్స్ డే రోజే చిన్న స్పెషల్ అనౌన్స్ మెంట్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా, ఏదైనా పెద్ద సినిమా ఫస్ట్ లుక్ గాని, లేదా సాంగ్ ప్రోమో గాని రిలీజ్ చేస్తారని అనుకున్నా, వాలెంటైన్స్ డే రోజు మాత్రం సినిమా అప్డేట్ ఇచ్చి ఘలక్ ఇచ్చారు. టైటిల్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్ రివీల్ చేసిన మేకర్స్ త్వరలోనే వస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ సినిమా పేరు “8 వసంతాలు”. ఫణింద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకు ముందు ఈ డైరెక్టర్ గతంలో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా ‘మను’ అనే సినిమా తీసాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, మంచి అభిరుచి గల డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

- Advertisement -

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కూడా మూవీ లవర్స్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. ఒక రోజా పూవు వర్షంలో రోడ్డు మీద పడినట్టు చూపిస్తూ పోస్టర్ డిజైన్ చేయగా, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి చెప్తూ ‘365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే… ఒక వసంతం’ అంటూ ‘8 వసంతాలు’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఇద్దరు ప్రేమికుల మధ్య 8 యేళ్లలో జరిగిన సంఘటనల నేపథ్యమే ఈ సినిమా కథ అని అనౌన్స్ చేసారు. ఇక సినిమా కాస్టింగ్ గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు గాని, తెరపైకి ఒక మంచి క్లాసిక్ సినిమా రాబోతుందని కాన్సెప్ట్ పోస్టర్ తోనే చెప్పేసారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు