Tom cruise: @61 లో నాలుగో సారి ప్రేమలో పడ్డ టామ్ క్రూజ్..!

Tom cruise

ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారని చెప్పాలి. ఆయన ఏకంగా నాలుగవసారి ప్రేమలో పడ్డారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. 61 యేళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టారు టామ్ క్రూజ్.. ఇక ఈయన విషయానికి వస్తే హాలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయన గురించి తెలియని ఆడియన్స్ ఎవరు ఉండరు. తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ వయసులో నాలుగో సారి ప్రేమలో పడ్డారని తెలిసి హాలీవుడ్ లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

రష్యా కి చెందిన ప్రముఖ మోడల్ ఎల్సినా ఖైరోవా తో టామ్ క్రూజ్ ప్రేమలో పడ్డారట. 2023 డిసెంబర్లో లండన్ లోని మేఫెయిర్ లో జరిగిన ఒక పార్టీలో వీరిద్దరూ పాల్గొన్నారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల లండన్ లోని ఎయిర్ అంబులెన్స్ ఛారిటీకి మద్దతు ఇచ్చే ఛారిటీ డిన్నర్ లో కూడా వీరిద్దరూ కలసి కనిపించారు. అంతేకాదు లండన్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్లలో కూడా వీరిద్దరూ డిన్నర్స్ చేస్తూ మీడియా కంటపడ్డారు. అలాగే ఎల్సినా ఇంటికి సమీపంలో ఉన్న హైడ్ పార్కులో కూడా వీరిద్దరూ చక్కర్లు కొడుతున్నారని అక్కడ చూసిన అభిమానులు చెబుతున్నారు..

అయితే గత కొంతకాలంగా తమ ప్రైవసీ దెబ్బ తినకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు రాకుండా టామ్ క్రూజ్ ఎంతో జాగ్రత్త పడ్డారు. అయితే హాలీవుడ్ మీడియాలో తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే హాలీవుడ్ హీరో ప్రముఖ మోడల్ ఎల్సినా ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓకే అపార్ట్మెంట్లో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టామ్ క్రూజ్ కి సంబంధించిన ఈ వార్త మరింత వైరల్ గా మారింది.

- Advertisement -

ఇకపోతే టామ్ క్రూజ్ ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకొని.. విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 1987లో మిమీ రోజర్స్ ను వివాహం చేసుకున్న 1990లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత నికోల్ కిడ్ మాన్ తో ఏడడుగులు వేసి 2001 లో విడిపోయారు. 2006లో కేటి హోమ్స్ తో రిలేషన్ మొదలుపెట్టిన టామ్ క్రూజ్ 2012లో ఆమెతో విడిపోయారు. మరి ఇప్పుడు ఎల్సినా తో ప్రేమాయణం మొదలుపెట్టారు. ఇక ఈమెతోనైనా జీవితాన్ని కొనసాగిస్తారా లేక బ్రేకప్ చెప్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు