Actor Suresh: మొదటి భార్యతో విడాకుల పై స్పందించిన సురేష్..!

 Actor Suresh

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా సురేష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. మొదట హీరోగా నటించిన ఈయన.. ఆ తర్వాత విలన్ గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తన కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు. అంతేకాకుండా పలు రకాల సీరియల్స్ లో కూడా నటించి భారీగానే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు సురేష్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయం పైన సురేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ముఖ్యంగా తన మొదటి భార్య పేరు హర్షిత రెడ్డి గురించి మాట్లాడుతూ.. తను మొదటి నుంచి ఇండస్ట్రీలో ఉండేది.. కానీ చదువుకోవాలని కోరికతో తాను నటించడం మానేసింది.. అయితే నాతో వివాహమైన తర్వాత తన పేరును అనిత సురేష్ గా మార్చుకుందని వెల్లడించారు. వివాహమైన కొన్నేళ్లకే తమకు ఒక బాబు కూడా పుట్టారని.. ఆ తర్వాత మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నామని.. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే పేరుతో కొనసాగుతోంది అంటూ తెలిపారు సురేష్.

ఒకప్పుడు తన భార్య ఇప్పుడు తన స్నేహితురాలి స్థానంలో ఉందంటూ వెల్లడించారు.. వరుసలు మారినప్పటికీ ఆప్యాయత మాత్రం మారలేదంటూ తెలియజేశారు ..విడిపోవడానికి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని..కేవలం ఆమె పెద్ద చదువుల కోసమే అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని కోరికగా ఉండేది కానీ నేను బిజీగా సినిమాలలో ఉండడం చేత తనతో రానని చెప్పేసాను అందుకే విడిపోయాం అంటూ సురేష్ తెలియజేశారు. విడిపోయే సమయంలో కూడా ఆస్తులను సమానంగానే పంచుకున్నామంటూ వెల్లడించారు.

- Advertisement -

నా భార్య అమెరికాకు వెళ్లి అక్కడే చదువుకొని రెండో వివాహం కూడా చేసుకొని అక్కడే స్థిరపడిపోయింది..నేనుకూడా రచయిత్రి రాశి ను రెండవ వివాహం చేసుకున్నాను అంటూ తెలిపారు.. ఒకవేళ అప్పుడే నేను కూడా అమెరికాకు వెళ్లి ఉంటే నా మొదటి భార్య నా ఇంట్లోనే ఉండేది.. కానీ ఏదో జరిగిపోయింది.. అయితే నా భార్య .. వారి కుటుంబం ఇండియాకి వస్తే మా ఇంట్లోనే ఉంటారంటూ సురేష్ కామెంట్స్ చేశారు. సురేష్ కు గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో కాస్త సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. మొత్తానికైతే చదువు కోసం మాత్రమే విడాకులు తీసుకున్నామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సురేష్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు