HBD Siva Karthikeyan: టాలీవుడ్ లో శివ కార్తికేయన్ సక్సెస్ స్టోరీ ఇదే..!

ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ తన సినిమాలతో టాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంటున్నారు. 1985 ఫిబ్రవరి 17వ తేదీన సిన్గం పునారి.. శివగంగ జిల్లా.. తమిళనాడులో జన్మించిన ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. తమిళ టీవీ పైన విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా తన కెరీర్ ను మొదలుపెట్టిన శివ కార్తికేయన్ ఆ తర్వాత కొన్ని షోలకు హోస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాతగా, గాయకుడిగా , గీతా రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. శివ కార్తికేయన్ చురుకుదనాన్ని గమనించిన దర్శకుడు పాండియరాజన్ మెరీనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇందులో సెంథిల్ నాదన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇకపోతే తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శివ కార్తికేయన్.. ఈయన అయలాన్ తో తాజాగా ఆకట్టుకుంటారు.. టాలీవుడ్ లో సక్సెస్ స్టోరీ ఎలా కొనసాగింది అంటే.. మొదటిసారి శివ కార్తికేయన్ నటించిన రెమో చిత్రం తెలుగులో అనువాదమై మంచి విజయాన్ని సాధించింది.. ఈ చిత్రంతోనే శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమా తర్వాత డాక్టర్ బాబు చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన శివ కార్తికేయన్ డాన్, ప్రిన్స్ వంటి చిత్రాలతో కూడా మరింత ఆకట్టుకున్నారు.. అంతేకాదు ఈయన చిత్రాలు డిఫరెంట్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఆదరించడం మొదలుపెట్టారు.. అలా తమిళ్ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు శివ కార్తికేయన్..

ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు తెలుగు ఆడియన్స్ కూడా శివ కార్తికేయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలు అందరూ పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి పెడుతుంటే.. శివ కార్తికేయన్ కూడా తెలుగు , తమిళ్ మాత్రమే కాకుండా హిందీ సినిమాలలో కూడా నటించాలని త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు శివ కార్తికేయన్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు