Dhamaka : మాస్ రాజాకు ముహూర్తం ఫిక్స్

రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా కొట్టిన మాస్ మహారాజ్, ఈ ఏడాది ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టేసిన ఆయన ఏకంగా అరడజను సినిమాలతో మన ముందుకు రానుండడం విశేషం. తాజాగా రవితేజ “ధమాకా” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ మూవీకి నేను లోకల్, సినిమా చూపిస్త మామ, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, జింతాక లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వచ్చింది.

ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం ఆదనపు ఆకర్షణగా నిలవనుందని తొలి పాటతోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని రెండో సింగిల్ పాటను రిలీజ్ చేసేందుకు ధమాకా యూనిట్ సిద్ధమయ్యింది. ‘మాస్ రాజా’, అంటూ సాగే ఈ పాటను సెప్టెంబర్ 23న సాయంత్రం 5:01 గంటలకు లిరికల్ సాంగ్ రూపంలో రిలీజ్ చేసేందుకు రవితేజ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు