Mrunal Thakur : ఫస్ట్ ఫ్లాప్ రుచి చూసిన మృణాల్… ఈ రిజల్ట్ ను ముందే గ్రహించిందా?

Mrunal Thakur : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే మృణాల్ ఠాకూర్ అని టక్కున చెప్తారు. గతంలో ఆమె చేసిన రెండు సినిమాలతో లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీకి తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీతో బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. మొత్తానికి టాలీవుడ్ లో ఫస్ట్ ప్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఈ రిజల్ట్ ను ముందే గ్రహించిందా? అందుకే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో లక్కీ గర్ల్ అనే బిరుదుపై అలాంటి కామెంట్స్ చేసిందా అంటున్నారు? ఆమె అభిమానులు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

హ్యాట్రిక్ మిస్… మృణాల్ కు ముందే తెలుసా?

ది ఫ్యామిలీ స్టార్ మూవీతో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో అని అంచనాలు పెట్టుకున్న మృణాల్ అభిమానులకు ఆ మూవీ గట్టి షాక్ ఇచ్చింది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో రెండు వరస హిట్లను అందుకున్న ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ తో మొట్టమొదటి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ల సమయంలో మృణాల్ తనను లక్కీ గర్ల్ అని సినీ జనాలు పిలవడం గురించి స్పందించింది. పైగా లక్కీ యాక్ట్రెస్ లేబుల్ పై అయిష్టతను వ్యక్తం చేసింది. ఆమె ఏ ముహూర్తాన అలాంటి కామెంట్స్ చేసిందో గానీ విధి మృణాల్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నట్టుంది. ది ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆమె కోరికను నిజం చేసింది. ఈ మూవీ డిజాస్టర్ కారణంగా మృణాల్ కు ఇప్పుడు లక్కీ ట్యాగ్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉందా? అంటే ఆన్సర్ మృణాల్ చెప్తేనే తెలుస్తుంది.

కొద్దిరోజుల క్రితం మృణాల్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధింనంత వరకు లక్కీ టైటిల్ తో పాటు అన్నీ తాత్కాలికమే అని చెప్పుకొచ్చింది. ఇప్పటి దాకా రియల్ లైఫ్ లో తనకు దగ్గరైన పాత్రలను మాత్రమే సినిమాల్లో పోషించానని, ఈ లక్కీ స్టార్ వంటి లేబుల్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చింది. మొత్తానికి మృణాల్ ఠాకూర్ మాటలను విధి విన్నట్టుగా ఉంది. అందుకే వాటినే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తో నిజం చేసి చూపించింది. అయితే ఆమె కామెంట్స్ ను విన్న అభిమానులు మాత్రం ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అవుతుందని ఈ హీరోయిన్ కు ముందే తెలుసేమో, అందుకే ఇలాంటి కామెంట్స్ చేసింది అని అంటున్నారు.

- Advertisement -

మృణాల్ కు పాన్ ఇండియా ఛాన్స్…

ఇక టాలీవుడ్ లో రెండు సినిమాలతో అదరగొట్టిన మృణాల్ మూడవ సినిమాతో ఫ్లాప్ రుచి చూసినప్పటికీ పాన్ ఇండియా మూవీలో అవకాశం కొట్టేసిందనే వార్త వైరల్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి మూవీలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ మూవీలోనైనా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి అభిమానులను ఆకట్టుకుంటుందా అనేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు