Samantha: చైతూ గురించి అభిమాని ప్రశ్న.. మాజీ ఏమన్నదంటే..?

Samantha.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట.. ఆ తర్వాత అనుకోకుండా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.. విడాకుల అనంతరం సమంత పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.. అయితే ఆ సమయంలో నాగచైతన్యను ఎవరు ఒక్క మాట కూడా అనకపోవడం గమనార్హం. నాగచైతన్య అమాయకుడని.. అతడికి ఏమీ తెలియదని.. సమంత ఇతరులతో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే విడాకులు జరిగాయి అంటూ కూడా రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇక సమంత కూడా తనదైన స్టైల్ లో ఇంస్టాగ్రామ్ ద్వారా విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.. కానీ ఎవరు కూడా ఆమెను నిందించడం ఆపలేదు..

నాగచైతన్య గురించి నెటిజన్ ప్రశ్న..
అయితే తాజాగా మరొకసారి నాగచైతన్య గురించి ఒక అభిమాని చేసిన కామెంట్లు సమంతకు మళ్ళీ ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది.. తాజాగా సమంత ఒక యోగ వీడియోని షేర్ చేసింది.. తన దినచర్యలో యోగాకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెబుతూ..దాని విలువ, ఉపయోగాలు తెలియజేస్తూ.. వీడియో విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ . ఇక సదరు వీడియో చూసిన అభిమానులు సమంతాను అభినందిస్తున్నారు. ఆమె లైఫ్ స్టైల్ పై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒక నెటిజన్ మాత్రం అనుకోకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు వేసి ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి.. ఒక నెటిజన్ సమంతను తన ప్రశ్నతో బాధపెట్టారు. “అమాయకుడైన నీ భర్త నాగచైతన్యను ఎందుకు మోసం చేశావు..?” అని అడిగారు..

- Advertisement -

నెటిజన్ ప్రశ్నకి సమంత ఘాటు రిప్లై..
దీంతో నెటిజెన్ ప్రశ్న కు సమంత గట్టి కౌంటర్ ఇచ్చింది.. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ..” ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు.. మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుపడాలి అని కోరుకుంటున్నాను” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది సమంత.. అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ సమంత వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదు అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు..

సమంత సినిమాలు..
సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో నటించగా.. ఈ సినిమా విడుదల అయ్యి పర్వాలేదు అనిపించుకుంది.. అలాగే మరొకవైపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ అయిన ఈ ప్రాజెక్టుకి హనీ బన్నీ అనే టైటిల్ కూడా మార్చారు. ఇకపోతే హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించగా.. ఇండియన్ వెర్షన్లో సమంత నటించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇదిలా ఉండగా మరొకసారి సమంత అల్లు అర్జున్ తో జత కట్టనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ..అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అట్లీతో సినిమా చేయబోతున్నారు.. ఈ ప్రాజెక్టులో సమంత హీరోయిన్గా ఎంపికైందని సమాచారం.. అలాగే చెన్నై స్టోరీ సినిమాలో కూడా శృతిహాసన్ స్థానంలో సమంత ఎంపికైందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు