Chiru Vs Krishna : బాక్స్ ఆఫీస్ వద్ద 8 సార్లు పోటీ.. నెగ్గిందెవరంటే..?

Chiru Vs Krishna : సాధారణంగా బాక్సాఫీస్ వద్ద చాలామంది హీరోలు పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ పోటీ అనేది ఒకటి లేదా రెండు సార్లు జరుగుతుంది.. ఈ పోటీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని విజయం వరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అనుకోకుండా ఏకంగా ఎనిమిది సార్లు పోటీ పడ్డ ఇద్దరు స్టార్ హీరోలు ఆ తర్వాత ఎవరు తమను తాము నిరూపించుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇక వారు ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి.. ఒకానొక సమయంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి లీడర్ గా వ్యవహరించేవారు.. ఆ తర్వాత ఆయన ఆదర్శం తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒకానొక సమయంలో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి లీడర్ గా వ్యవహరించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆయనతోనే పోటీపడడం అనేది ఆశ్చర్యకర సందర్భమని చెప్పవచ్చు.. మరి కృష్ణ, చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఎనిమిది సార్లు ఏఏ సినిమాలతో పోటీపడ్డారు? అందులో ఎవరు గెలిచారు ? అన్నది ఇప్పుడు చూద్దాం..

బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డ చిరు – కృష్ణ :

మొదటిసారి బెజవాడ బెబ్బులి సినిమాతో కృష్ణ… ప్రేమ పిచ్చోళ్ళు సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి..

- Advertisement -

ఇక తర్వాత 1983లో వీరిద్దరి మధ్య పోటీ మళ్ళీ మొదలైంది… పల్లెటూరు మొనగాడు సినిమాతో చిరంజీవి.. ఊరంతా సంక్రాంతి అనే సినిమాతో కృష్ణ బరిలోకి దిగారు. ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద కృష్ణ డిజాస్టర్ గా నిలవగా.. చిరంజీవి సినిమా యావరేజ్ టాక్ తో పర్వాలేదనిపించుకుంది.

అభిలాష సినిమాతో చిరంజీవి పోటీ పడగా.. కిరాయి కోటిగాడు సినిమాతో కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు అయితే ఇందులో చిరంజీవి నటించిన అభిలాష సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాదు అందులోని పాటలు మరింత విజయాన్ని దక్కించుకున్నాయి అలాగే కృష్ణా నటించిన కిరాయి కోటిగాడు సినిమా కూడా సూపర్ హిట్ అందుకోవడం విశేషం.. ఇలా రెండు సినిమాలు కూడా విజయాన్ని అందుకోవడమే కాదు ఈ రెండూ కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రావడం గమనార్హం

ఇక నాలుగవసారి అడవి సింహం సినిమాతో కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే..చిరంజీవి ఆలయ శిఖరం సినిమాతో వచ్చారు . అడవి సింహం సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఆలయ శిఖరం మాత్రం పర్వాలేదు అనిపించుకుంది.

ఆ తర్వాత మరోసారి సిరిపురం మొనగాడు సినిమాతో కృష్ణ ప్రేక్షకుల ముందుకు రాగా.. శివుడు శివుడు శివుడు అనే సినిమాతో చిరంజీవి పోటీపడ్డారు. ఇక సిరిపురం మొనగాడు సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే శివుడు శివుడు శివుడు సినిమా మాత్రం పరవాలేదు అనిపించుకుంది.

మళ్లీ కృష్ణ అమాయకుడు కాదు అసాధ్యుడు సినిమాతో కృష్ణ పోటీ పడగా.. గూడచారి నంబర్ వన్ సినిమాతో చిరంజీవి వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

రామరాజ్యంలో భీమరాజు సినిమాతో కృష్ణ పోటీ పడగా.. మోసగాడు సినిమాతో చిరంజీవి థియేటర్ వద్ద పోటీపడ్డారు. కృష్ణ ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా చిరంజీవి కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. చిరంజీవి వర్సెస్ కృష్ణ కాంబినేషన్లో చాలాసార్లు వరుస విజయాలను కృష్ణ తన ఖాతాలో వేసుకున్నారు. అలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోటీలో కృష్ణనే విజేతగా నిలిచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు