Chai Bisket : మేమ్ ఫెమస్ కొత్త రకం ప్రమోషన్స్

యూట్యూబ్ లో ఛాయ్ బిస్కెట్ వీడియోస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. క్వాలిటీ కంటెంట్ తో వారం, వారం జనాలని ఎంటర్టైన్ చేస్తూ ఛాయ్ బిస్కెట్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇన్ని రోజులు యూట్యూబ్ లో ఎంటర్టైన్ చేసిన ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు అదే ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో ఇవ్వడానికి సిద్దమైంది. రీసెంట్ గా సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో సినిమాలని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టిన ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు “మేమ్ ఫెమస్” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే సుమంత్ ప్రభాస్ హీరోగా, సార్య, సిరి హీరోయిన్స్ గా వస్తోన్న సినిమా “మేమ్ ఫెమస్” యాక్టర్ సుమంతే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేసాడు. ఇటీవలే తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి చేతుల మీద సినిమా టీజర్ ని లాంచ్ చేసాడు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో ముగ్గురి ఫ్రెండ్స్ మధ్య జరిగే కథగా సినిమాగా ఉండబోతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని మొదటగా జూన్ 2న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన మూవీ టీం రిలీజ్ డేట్ ని ప్రిపోన్ చేసి ఈ నెల(మే)26న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో ఎక్స్ పర్ట్ అయిన ఛాయ్ బిస్కెట్ మేమ్ ఫెమస్ సినిమా ప్రమోషన్స్ కొత్త తరహాలో ప్రారంభించింది. అందరి సెలెబ్రెటీస్ తో మేమ్ ఫెమస్ పంచ్ లైన్స్ చెప్పిస్తూ వాళ్ళతో తీన్మార్ స్టెప్ లు వేయిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, నవదీప్, అల్లు అరవింద్ లతో చిందులెపించిన మేం ఫెమస్ మూవీ టీం, సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు