Samantha : శాకుంతలం సినిమా మరి ఇంత డిజాస్టర్ అనుకోలేదు

గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఈ ఇయర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మహాకవి కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా తెరకెక్కించారు. గుణశేఖర్ కూతురు నీలిమ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.

ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోలలో పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. కానీ థియేటర్ లో మొదటి షో పడగానే వ్యవహారం మారిపోయింది. రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన మూవీ టీం మొదటి షోతో ప్రేక్షకులు ప్లాప్ అని తేల్చేసరికి మూవీకి సంబంధించిన ఎవరు కూడా సినిమా రిజల్ట్ గురించి మాట్లాడటానికి ముందుకి రాలేదు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన శాకుంతలం మొత్తం థియేటర్ రన్ లో కేవలం 5% మాత్రమే వసూళ్ళని రాబట్టింది.అంటే కేవలం 4కోట్ల క్లోజింగ్ షేర్ తో శాకుంతలం పరుగు ఆగిపోయిందన్నమాట.

అయితే ఇలాంటి ఎదురు దెబ్బలు తగలడం డైరెక్టర్ గుణశేఖర్ కి ఇదేం కొత్త కాదు గతంలో కూడా బాహుబలి సినిమాని బీట్ చేయాలనే ఉద్దేశ్యంతో రుద్రమదేవి సినిమా తీసి ఇలాగే నష్టాల పాలయ్యాడు. విఎఫ్ఎక్స్ ఉంటె సినిమా హిట్ అయినట్టే అనే పిచ్చి భ్రమలో కథ మీద ఎలాంటి ఫోకస్ చేయకుండ, అనవసరమైన హంగులు, ఆర్భాటాలతో సినిమాలని తీసి ప్రతిసారి చేదు అనుభవాన్నే మిగుల్చుకుంటున్నాడు. అయితే శాకుంతలంతో పోలిస్తే రుద్రమదేవి సినిమా కాస్తా మెరుగనే చెప్పాలి. రుద్రమదేవి రిలీజ్ సమయంలో బాహుబలి మేనియా ఉండటం వల్ల పెట్టిన బడ్జెట్ కలెక్ట్ చేసి ఒక మోస్తరు లాభంతో బయట పడగలిగారు కానీ శాకుంతలం సినిమా మాత్రం నిండా ముంచేసింది. ఇకముందు నుంచైనా గుణ శేఖర్ విఎఫ్ఎక్స్ పై కాకుండ, కథ మీద శ్రద్ధ పెట్టి సినిమా తీస్తాడో ఎప్పటిలాగే మొండి పట్టుదలతో విఎఫ్ఎక్స్ ని నమ్ముకొని మరో లేడి ఓరియెంటెడ్ సినిమాతో ముందుకు వస్తాడో చూడాలి. ప్రస్తుతం శాకుంతలం అమెజాన్ ప్రైమ్ లో అన్ని భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు