Mehreen Comments: రొమాంటిక్ సీన్స్ ఇష్టంతో కాదు… బలవంతంగా చేసింది

మెహ్రీన్ పిర్జాదా… ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటున్న హీరోయిన్. ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ రాని నటి. అందం, అభినయం ఇలా అన్ని ఉన్నా.. లక్ లేకపోవడం వల్లనేమో… హీరోయిన్ గా అయితే సక్సెస్ కాలేకపోతుంది ఈ బ్యూటీ. ఫస్ట్ మూవీ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ నుంచి… F3 వరకు మెహ్రీన్ కెరీర్‌లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ, ఈమెకు గుర్తింపు తీసుకుచ్చిన సినిమాలు విషయానికి వస్తే… ఒక్కటి కూడా లేదు అని చెప్పొచ్చు.

దీంతో స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్న మోహ్రీన్… ఇటీవల ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. మెహ్రీన్ మొదటి సారిగా నటించిన వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఈ నెల 13న హాట్‌ స్టార్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ కాస్త బోల్డ్ సీన్స్ లో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మెహ్రీన్ ను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.

లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా చేసినట్టు… సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో మెహ్రీన్ ఇష్టంగా రొమాన్స్ సీన్స్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి మెహ్రీన్ హార్ట్ అయింది. అంతే కాదు.. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రెండు పేజీలు తన పాత్ర గురించి రాసుకొచ్చింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో తాను చేసిన రొమాంటిక్ సీన్స్ ఇష్టంతో చేసినవి కాదని, పాత్ర డిమాండ్ చేస్తే చేయాల్సి వచ్చిందని అలాగే, ఆ పాత్ర చేసింది రొమాంటిక్ సీన్స్ అనడం కంటే, బలవంతం చేసే సీన్స్ అనడం కరెక్ట్ అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

వైవాహిక జీవితంలో ఆ పాత్ర లైంగికంగా ఎదుర్కొన్న సమస్యలు వెబ్ సిరీస్ లో ఉన్నాయని, వాటిని చూడాలి కానీ రొమాంటిక్ సీన్స్ అంటూ కామెంట్స్ చేయొద్దు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది.

Mehreen comments on her bold role in Sultan of Delhi web series
Mehreen comments on her bold role in Sultan of Delhi web series
Mehreen comments on her bold role in Sultan of Delhi web series
Mehreen comments on her bold role in Sultan of Delhi web series

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు