Weight Loss Tip – GM Diet Plan: వారంలో 5 కేజీలు తగ్గడానికి బెస్ట్ ప్లాన్ ఇదిగో…

ప్రస్తుత కాలంలో స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. క్షణం తీరకలేని జీవితం వల్ల ఎలాంటి వర్కౌట్స్ చేయకపోవడంతో ఈ స్థూలకాయం బాదితుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డైట్ ప్లాన్స్ పై వీరి చూపు పడుతుంది. అయితే డైట్ ప్లాన్స్‌లో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది GM diet planకే. GM diet plan గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

GM diet planని ముందుగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సహాయంతో జనరల్ మోటార్స్ 1985లో ఫస్ట్ టైం తీసుకొచ్చింది. జనరల్ మోటార్స్ తమ ఉద్యోగుల కోసం తీసుకుచ్చిన ఈ డైట్ ప్లాన్ సక్సెస్ కావడంతో పాపులర్ అయింది. అందుకే ఆ కంపెనీ పేరు మీదుగా ఈ డైట్ ప్లాన్‌కి GM డైట్ ప్లాన్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు చాలా మంది ఈ డైట్ ప్లాన్ చేసి 7 రోజుల్లోనే 5 కేజీలు తగ్గిపోయారు. ఈ డైట్ ప్లాన్‌లో ప్రతి రోజు ఏం చేయాలో ఇక్కడ చూద్ధాం.

1St Day…

- Advertisement -

GM diet planలో భాగంగా మొదటి రోజు ఆహారంగా కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్‌ని ఆహారంగా తీసుకొవచ్చు. అయితే అరటిపండ్లకు మాత్రం దూరంగా ఉండాలి. అందులో ఖర్బూజ, పుచ్చకాయ తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఫస్ట్ డే 8 నుంచి 12 గ్లాసుల నీళ్లును తీసుకోవాలి.

టైమ్ టేబుల్…

08:00 AM: 1 మీడియం ఆపిల్ & కొన్ని రేగు పండ్లు లేదా నారింజ పండ్లు
10:30 AM: ½ గిన్నె మస్క్మెలోన్ ముక్కలు
12:30 PM: 1 గిన్నె పుచ్చకాయ
4:00 PM: 1 పెద్ద నారింజ లేదా మొసాంబి
6:30 PM :: 1 కప్పు సీతాఫలం & దానిమ్మ సలాడ్
8:30 PM : ½ కప్పు పుచ్చకాయ

2nd Day…

రెండో రోజు పెద్దగా ఉన్న బంగాళదుంపను ఉడికించి తినాలి. అలాగే మీకు ఇష్టమైన కురగాయలను నూనే లేకుండా వండి కానీ, వండకుండా కానీ తినాలి. దీంతో పాటు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లును తీసుకోవాలి.

టైమ్ టేబుల్…

08:00 AM: 1 కప్పు ఉడికించిన బంగాళదుంపలు
10:30 AM: ½ గిన్నె దోసకాయ
12:30 PM: 1 కప్పు పాలకూర, బచ్చలికూర, దోసకాయ & క్యాప్సికం
04:00 PM: ½ కప్ ముక్కలు చేసిన క్యారెట్లు & ఒక గ్లాసు నిమ్మరసం, చిటికెడు ఉప్పు
06:30 PM: 1 కప్పు ఉడికించిన బ్రోకలీ & పచ్చి బఠానీలు
08:30 PM: 1 దోసకాయ

3rd Day…

మూడో రోజు ఆరటిపండు కాకుండా మిగిలిన అన్ని ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకోవాలి. నూనే లేకుండా వండిన కూరగాయాలు లేదా, వండలేని కూరగాయాలను ఆహారంగా తీసుకోవచ్చు. అయితే ఇందులో బంగాళదుంప మాత్రం ఉండకూడదు. అలాగే 8 నుంచి 12 గ్లాసుల నీళ్లును తీసుకోవాలి.

టైమ్ టేబుల్…

08:00 AM: ½ గిన్నె మస్క్మెలోన్
10:30 AM: 1 కప్పు పైనాపిల్ లేదా పియర్
12:30 PM: 1 కప్పు పాలకూర, బచ్చలికూర, దోసకాయ & క్యాప్సికం
04:00 PM: ½ కప్ ముక్కలు చేసిన క్యారెట్లు & ఒక గ్లాసు నిమ్మరసం, చిటికెడు ఉప్పు
06:30 PM: 1 కప్పు ఉడికించిన బ్రోకలీ & పచ్చి బఠానీలు
08:30 PM: 1 దోసకాయ

4th Day…

నాలుగో రోజు 8 నుండి 10 అరటిపండ్లు, 3 నుండి 4 గ్లాసుల పాలు తీసుకోవాలి. ఎప్పటిలాగే 8 నుండి 12 గ్లాసుల నీరు తాగాలి.

టైమ్ టేబుల్…

08:00 AM: 2 అరటిపండ్లు
10:30 AM: 1 అరటిపండు
12:30 PM: మిల్క్ షేక్ (2 అరటిపండ్లు + 1 గ్లాసు పాలు + కోకో పౌడర్ డాష్)
04:00 PM: 2 అరటిపండ్లు
06:30 PM: 1 అరటిపండు & 1 గ్లాసు పాలు
08:30 PM: 1 గ్లాసు పాలు

5th Day…

ఐదో రోజు ఆహారంగా 6 టమోటాలు, ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. అలాగే 12 నుండి 15 గ్లాసుల నీరు కూడా తీసుకోవాలి.

టైమ్ టేబుల్…

09:00 AM: 3 టమోటాలు
12:30 PM: ½ కప్ బ్రౌన్ రైస్ & వివిధ రకాల కూరగాయలు
04:00 PM: 2 టమోటాలు
06:30 PM: 1 గిన్నె బ్రౌన్ రైస్ & 1 టమోటా & ½ కప్పు వేయించిన కూరగాయలు

6th Day…

ఆరో రోజు ఒక కప్పు బ్రౌన్ రైస్‌తో పాటు నూనె లేకుండా మీకు నచ్చిన వండిన లేదా వండని కూరగాయలు తినాలి. అయితే ఇందులో బంగాళదుంపలు లేకుండా చూసుకోవాలి. అలాగే 8 నుండి 12 గ్లాసుల నీటిని మిస్ చేయొద్దు.

టైమ్ టేబుల్…

09:00 AM: 1 గ్లాస్ క్యారెట్ రసం
12:30 PM: ½ కప్ బ్రౌన్ రైస్ + ½ కప్పు కూరగాయలు
04:00 PM: 1 కప్పు దోసకాయ ముక్కలు
06:30 PM: ½ గిన్నె బ్రౌన్ రైస్ & ½ కప్పు కూరగాయలు, చికెన్/కాటేజ్ చీజ్

7th Day…

చివరి రోజు ఒక కప్పు బ్రౌన్ రైస్‌తో పాటు ఏవైనా కూరగాయలు తీసుకోవాలి. వీటితో పాటు అన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ డైట్‌లో యాడ్ చేసుకోవాలి.

టైమ్ టేబుల్…

09:00 AM: 1 గ్లాస్ నారింజ/యాపిల్ రసం
12:30 PM: ½ కప్ బ్రౌన్ రైస్ & ½ కప్పు వేయించిన కూరగాయలు
04:00 PM: 1 కప్పు పుచ్చకాయ/కొన్ని రకాల బెర్రీలు
06:30 PM: 1 గిన్నె GM సూప్

GM సూప్ అంటే..?

ఈ డైట్ లో GM సూప్ చాలా ముఖ్యమైనది. ఈ సూప్ చివరి రోజు కాకుండా ఏ రోజైనా తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. దీని వల్ల ఆకలి తగ్గిపోతుంది.

GM సూప్ తయారికి కావాల్సినవి…

1 స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాలు, ఒక క్యాబేజీ, మూడు టమోటాలు, ఆరు పెద్ద ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, ఆకుకూరలు, అర లీటరు నీరు.

తయారు పద్దతి…

ముందుగా ఉల్లిపాయలు చిన్నగా తరగాలి. వాటిని ఆలివ్ నూనెలో తేలికపాటి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అప్పుడు, టమోటాలు, ఆకుకూరలు, క్యాబేజీని కట్ చేసి, నీటిలో ఉడకబెట్టాలి. అలా 1 గంట పాటు ఉడికన తర్వాత సూప్ లో కొంచెం ఉప్పు, మిరయాలు వేసుకోవాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు