Manchu Lakshmi: పెళ్లి గురించి మనోజ్‌నే అడగండి

గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ రెండవ వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికతో మంచు మనోజ్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక ఇటీవల జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నానని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని మనోజ్ చెప్పడంతో అందరూ ఆయన తప్పనిసరిగా తన రెండవ పెళ్లి గురించి చెబుతారని భావించారు. కానీ ఆయన తన వాట్ ద ఫిష్ సినిమా గురించి ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. అయినప్పటికీ మనోజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ విషయంపై మనోజ్ సోదరి మంచు లక్ష్మి స్పందించింది. ఆదివారం రోజు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్ రెండవ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి స్పందించిన మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ” నేను కుటుంబంతో ఇలా గుడికి వచ్చినప్పుడు మీరు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి నన్ను అడిగే బదులు అతనినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే నేను చెబుతాను. ప్రస్తుతం అగ్ని నక్షత్రం సహా నావి 4 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాటని కూడా రిలీజ్ చేస్తున్నాను. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో లో ఓ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్ ఈ ప్రోగ్రాం కి వస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా 45 వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిదిలో లేనిది అడిగితే చెప్పలేను” అని పేర్కొన్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు