SSMB28 : మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ లీక్

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలనే రిలీజైన ఫస్ట్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వస్తుండటంతో ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అతడు సినిమాలో మహేష్ తో క్లాస్ పర్ఫామెన్స్ చేయించిన త్రివిక్రమ్, ఖలేజా సినిమాతో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ బయటికి తీసి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసారు. ఆ తరువాత వీళ్లిద్దరు కోలాబిరేట్ అయ్యి సినిమా చేయాలనుకున్న మహేష్ కి, త్రివిక్రమ్ కి వేరే వేరే కమిట్మెంట్స్ ఉంటడం వల్ల ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

దాదాపు 13 ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. మహేష్ కి జోడిగా ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే టీజర్ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న కూడా టైటిల్ ఏది పెట్టాలనే క్లారిటీ లేని మూవీ రీసెంట్ గానే ఒక టైటిల్ ఫిక్స్ చేసారని టాక్. ముందుగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ని అనుకున్న త్రివిక్రమ్ “గుంటూర్ కారం” అనే టైటిల్ ఫిక్స్ చేసారంట.అయితే అతడులో క్లాస్ మహేష్ ని , ఖలేజా కామెడీ మహేష్ ని చూపించిన త్రివిక్రమ్.. ఈసారి మహేష్ ని మాస్ అవతార్ లో చూపించబోతున్నాడట. అందుకే సినిమాకి సరిగ్గా సరిపోయేలా గుంటూర్ కారం అనే టైటిల్ ఒకే చేరినట్టు సమాచారం. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఒక పిక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు